108MP ఓఐఎస్ కెమెరా, 6000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచైన Samsung Galaxy F54 5G

Highlights

  • 25 వాట్ చార్జింగ్, 6.7-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన Samsung Galaxy F54 5G
  • భారత్ లో Samsung Galaxy F54 5G ధర రూ.29,999
  • ఫ్లిప్ కార్ట్, శాంసంగ్.కామ్, రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్స్

Samsung Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. ఈ హ్యాండ్సెట్ ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఆఫరింగ్ గా మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ లో పంచ్-హోల్ కటౌట్, సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Samsung Galaxy F54 5G డివైజ్ 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చింది. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ వాడారు. 128జిబి, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

భారత్ లో Samsung Galaxy F54 5G ధర, లభ్యత

  • భారత్ లో Samsung Galaxy F54 5G ధరను రూ.29,999 గా నిర్ణయించారు.
  • మిటియోర్ బ్లూ, స్టార్‌డస్ట్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy F54 5G.
  • లాంచ్ ఆఫర్ లో భాగంగా, అన్ని డిస్కౌంట్స్ కలుపుకుని రూ.27,999 ధరకి లభించనున్న Samsung Galaxy F54 5G.
  • ఫ్లిప్ కార్ట్, శాంసంగ్.కామ్, ప్రముఖ రిటైల్ స్టోర్స్ లో జూన్ 6 నుంచి ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F54 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy F54 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: Samsung Galaxy F54 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. కంపెనీ ఈ ఫోన్ కి 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్ మరియు 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని హామీ ఇస్తోంది.
  • కెమెరా: Samsung Galaxy F54 5G లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy F54 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • డైమెన్షన్స్: ఈ డివైజ్ 164.9 మి.మీ పొడవు, 77.3 మి.మీ వెడల్పు, 8.4 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.
Previous articleలీకైన Vivo X100 సిరీస్ చిప్సెట్స్ వివరాలు
Next articleలీకైన Vivo X90S లాంచ్ టైమ్‌లైన్, iQOO 11S లాంచ్ తేదీ!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.