ఇప్పుడు Redmi 12C ధర రూ.7,999 మాత్రమే; ఆఫర్ వివరాలు తెలుసుకోండి!

Highlights

  • తగ్గిన Redmi 12C స్మార్ట్ ఫోన్ ధర
  • బేస్ వేరియంట్ కి వర్తించనున్న ఆఫర్
  • 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో వచ్చిన ఫోన్

మీరు గనుక తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని భావిస్తుంటే, అందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే రెడ్మీ సంస్థ తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Redmi 12C ధరను తగ్గించింది. అయితే, ఈ ధర తగ్గింపు కొంత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫోన్ గురించి మాట్లాడితే, ఇందులో 6.71-ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ85 చిప్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి.

Redmi 12C ఆఫర్ వివరాలు

  • Redmi 12C పై ధర తగ్గింపు కేవలం బేస్ వేరియంట్ కి మాత్రమే లభిస్తుంది. బేస్ వేరియంట్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • ఈ ఏడాది ఏప్రిల్ లో Redmi 12C డివైజ్ రూ.8,999 ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో ఈ ఫోన్ ధర రూ.8,799 గా చూపిస్తోంది. అంటే ఫోన్ పై నేరుగా రూ.200 తగ్గించారన్నమాట. మీరు మరొక రూ.800 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
  • ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, హెచ్డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ తో Redmi 12C ఫోన్ ని కొనుగోలు చేస్తే, రూ.800 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
  • డిస్కౌంట్ అనేది కేవలం ఈఎంఐ ఆర్డర్లకు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. అయితే, యూపీఐ పేమెంట్ యాప్ అమెజాన్ పే ద్వారా డబ్బు చెల్లించి రూ.800 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతో Redmi 12C ని రూ.7,999 కే కొనుగోలు చేయవచ్చు.
  • క్రెడిట్/డెబిట్ కార్డ్ ఆఫర్ కి జూన్ 15 చివరి తేదీ అని అమెజాన్ వెల్లడించింది.

Redmi 12C స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 12C లో 6.71-ఇంచ్ హెచ్డీ+ నాచ్ డిస్ప్లే, 500 నిట్స్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్, ఏఆర్ఎం మాలి-జీ52 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 12C లో 4జిబి/6జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇంకా 3జిబి/5జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది.
  • కెమెరా: Redmi 12C లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: Redmi 12C లో 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్-సిమ్, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏజీపీఎస్, బైడూ, గెలీలియో, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉన్నాయి.
  • బ్యాటరీ: Redmi 12C లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi 12C స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 12C లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇంకా ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ ని కలిగి ఉంది.
Previous articleరూ.902 ప్లాన్ లాంచ్ చేసిన Vodafone Idea; బెనిఫిట్స్ తెలుసుకోండి!
Next articleటాప్ 5 Photo Editor యాప్స్ ఫీచర్లు తెలుసుకోండి!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.