6.4-ఇంచ్ AMOLED డిస్ప్లే, Snapdragon 695 చిప్‌తో లాంచైన OPPO Reno 9A

Highlights

  • జపాన్ లో లాంచైన OPPO Reno 9A
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చిన డివైజ్
  • OPPO Reno 9A ధర 40,656 యెన్‌లు (సుమారు రూ.24,000)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO తన రెనో 9 సిరీస్ లో OPPO Reno 9A అనే డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ జపాన్ లో లాంచ్ అయ్యింది. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, OPPO Reno 9A లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 409 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సరే, ఓసారి OPPO Reno 9A ధర, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. ఇది కూడా చదవండి: లీకైన OnePlus Nord 3 రెండర్స్; రివీలైన పూర్తి డిజైన్!

OPPO Reno 9A ధర

OPPO Reno 9A స్మార్ట్ ఫోన్ నైట్ బ్లాక్ మరియు మూన్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ జపాన్ లో జూన్ 22 నుంచి సేల్ కి వస్తోంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. OPPO Reno 9A ధర 40,656 యెన్‌లు (సుమారు రూ.24,000) గా ఉంది. గ్లోబల్ మార్కెట్స్ లో ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని ఒప్పో ఇంకా వెల్లడించలేదు. ఇది కూడా చదవండి: భారత్‌లో జులై 11 న లాంచ్ కానున్న Nothing Phone (2)

OPPO Reno 9A స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 9A లో 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 409 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 89.4 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్నాయి.
  • చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 9A స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ వాడారు. 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా విభాగం: OPPO Reno 9A డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: OPPO Reno 9A స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OPPO Reno 9A లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO Reno 9A స్మార్ట్ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్, ఐపీఎక్స్8 రేటింగ్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: OPPO Reno 9A లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, 3.5మి.మీ ఆడియో జాక్, జీపీఎస్, బైడూ, గ్లొనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
Previous articleభారత్‌లో జులై 11 న లాంచ్ కానున్న Nothing Phone (2)
Next articleడెయిలీ 2జిబి డేటా అందించే Jio రీచార్జ్ ప్లాన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.