
జులై 5 వ తేదీన OnePlus Nord 3 భారత్ లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు OnePlus Nord 3 CE, OnePlus Nord Buds 2r TWS కూడా లాంచ్ కానున్నాయి. ఇటీవలి కాలంలో OnePlus Nord 3 కి సంబంధించిన ఎన్నో లీక్స్ బయటకు వచ్చాయి. తాజాగా నెట్టింట్లో ఈ ఫోన్ యొక్క ప్రచార చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఇవాన్ బ్లాస్ ద్వారా ఈ రెండర్స్ ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. అలాగే ముఖ్యమైన హార్డ్‌వేర్ వివరాలు కూడా బయటకు వచ్చాయి.
OnePlus Nord 3 ఇమేజెస్, ఫీచర్స్
- OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, వేపర్ చాంబర్ తో వస్తోంది.
- OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, స్లిమ్ బెజెల్స్ ఉంటాయి.
- OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ బాక్సీ డిజైన్, రౌండెడ్ ఎడ్జెస్ తో వచ్చింది.
- OnePlus Nord 3 లో రెండు భారీ సర్క్యులర్ రింగ్స్ ఉంటాయి. ఇందులో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
- OnePlus Nord 3 డివైజ్ లో వాల్యూమ్ రాకర్ ఎడమవైపున, పవర్ బటన్, అలర్ట్ స్లైడర్ కుడివైపున ఉంటాయి.
- ఒక ఇమేజ్ లో ఐఆర్ బ్లాస్టర్, సెండరీ మైక్రోఫోన్ ఉన్నట్లు కనిపిస్తోంది.
OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
- చిప్సెట్: ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉండవచ్చు.
- ర్యామ్, స్టోరేజీ: ఈ హ్యాండ్సెట్ లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
- ఓఎస్: OnePlus Nord 3 స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: OnePlus Nord 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: OnePlus Nord 3 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











