
మోటోరోలా సంస్థ తన జీ-సిరీస్ ని ఎక్స్‌ప్యాండ్ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే జీ-సిరీస్ లో పలు ఫోన్లు మార్కెట్ లో ఉన్నాయి. తాజాగా Motorola G14 డివైజ్ ని లాంచ్ చేసేందుకు మోటోరోలా కంపెనీ ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా Motorola G14 డివైజ్ ఈఈసీ వెబ్ సైట్ పై కనిపించింది. తాజాగా ఈ ఫోన్ టీడీఆర్ఏ సైట్ పై కనిపించింది.
Motorola G14 TDRA లిస్టింగ్
Motorola G14 స్మార్ట్ ఫోన్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై XT2341-4 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ పేరు కన్ఫర్మ్ అయ్యింది. తక్కువ ధరలోనే ఈ ఫోన్ రానుంది. త్వరలోనే కంపెనీ ఈ ఫోన్ ని లాంచ్ చేయనుందని స్పష్టమైంది. అయితే, మోడల్ నంబర్, పేరు కాకుండా ఇతర సమాచారం ఏమీ లిస్టింగ్ ద్వారా బయటకు రాలేదు. Motorola G13 కి సక్సెసర్ గా Motorola G14 మార్కెట్ లోకి వస్తోంది. ఓసారి Moto G13 ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Moto G13 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Moto G13 లో 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Moto G13 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
- కెమెరా: Moto G13 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Moto G13 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇందులో 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
- ఓఎస్: Moto G13 స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Moto G13 స్మార్ట్ ఫోన్ లో 4జీ, డ్యూయల్ సిమ్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.












