తక్కువ ధరలో లాంచ్ కానున్న Samsung Galaxy A05; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి!

Highlights

  • బడ్జెట్ రేంజ్ లో మంచి ఆప్షన్ గా నిలవనున్న Galaxy A05
  • పెర్ఫామెన్స్ కై ఆక్టా-కోర్ చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్మార్ట్ ఫోన్

Samsung Galaxy A05, ఇదొక చీపెస్ట్ ఏ-సిరీస్ ఫోన్. శాంసంగ్ సంస్థ త్వరలో ఈ ఫోన్ ని లాంచ్ చేయనుంది. తక్కువ ధరలో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. అంటే బడ్జెట్ రేంజ్ లో ఫోన్ కొనాలనుకునే వారికి Samsung Galaxy A05 మంచి ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ డివైజ్ ఇప్పటికే Wi-Fi Alliance సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో Samsung Galaxy A05 వివరాలు కొన్ని రివీల్ అయ్యాయి. సరే, ఓసారి లీకైన స్పెసిఫికేషన్స్, ధర మరియు లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A05 లిస్టింగ్

  • ప్రస్తుతం Samsung Galaxy A05 కి సంబంధించిన లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. కానీ, తాజా లీక్్ లో ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలిసింది.
  • Samsung Galaxy A05 స్మార్ట్ ఫోన్ వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై SM-A055F-DS అనే మోడల్ నంబర్ తో కనిపించింది.
  • Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానుందని లిస్ట్ లో పేర్కొనబడి ఉంది.
  • వై-ఫై 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ కి సపోర్ట్ చేయనున్న Samsung Galaxy A05.
  • ఇప్పటివరకు డివైజ్ గురించి తెలిసింది ఇంతే. ఇది కాకుండా కంపెనీ నుంచి ఇంకా ఏ వివరాలు బయటకు రాలేదు. త్వరలోనే ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A05 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు.
  • ప్రాసెసర్: Samsung Galaxy A05 లో ఆక్టా-కోర్ చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం.
  • స్టోరేజీ: Samsung Galaxy A05 స్మార్ట్ ఫోన్ లో 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ కూడా ఈ ఫోన్ లో ఉండవచ్చు.
  • కెమెరా: Samsung Galaxy A05 డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48 ఎంపి ప్రైమరీ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాష్, రెండు 2 ఎంపి కెమెరాలు ఉండవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A05 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వివరాలు ఇంకా తెలియదు.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy A05 స్మార్ట్ ఫోన్ లో 4జీ కనెక్టవిటీ, డ్యూయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.

Samsung Galaxy A05 ధర

Samsung Galaxy A05 ధర రూ.10 వేల నుంచి రూ.12 వేల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏ బడ్జెట్ రేంజ్ లో ఈ ఫోన్ ని శాంసంగ్ తీసుకురానుందో చూడాలి. అయితే, గతంలో శాంసంగ్ తీసుకొచ్చిన ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్లను గమనిస్తే, Samsung Galaxy A05 ధర ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.

Previous articleఖరారైన OPPO K11 5G లాంచ్ తేదీ; Snapdragon 782G చిప్‌తో వస్తోన్న డివైజ్!
Next articleఆగస్టు 1 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Redmi 12
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.