120Hz డిస్ప్లే, 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్న iQOO Z8

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iQOO Z8
  • తాజాగా లీకైన iQOO Z8 స్పెసిఫికేషన్స్
  • ఎల్సీడీ డిస్ప్లే, 120 వాట్ చార్జింగ్ తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ త్వరలో iQOO Z8 డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, iQOO Neo 8 మరియు iQOO Neo 8 Pro డివైజెస్ చైనా మార్కెట్ లో మే నెలలో లాంచ్ అయ్యాయి. దీనికి తోడు కొన్ని వారాల క్రితం iQOO 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ iQOO 11S ని కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు iQOO Z8 ని తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా iQOO Z8 వివరాలు లీక్ అయ్యాయి. iQOO Z7 కి సక్సెసర్ గా iQOO Z8 ఎంట్రీ ఇవ్వనుంది.

రివీలైన iQOO Z8 స్పెసిఫికేషన్స్

డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసిన సమాచారాన్ని బట్టి, iQOO Z8 హై-పెర్ఫామెన్స్ ఫ్లాగ్షిప్ డివైజ్ గా రానుంది. ఈ ఫోన్ లో ఎల్సీడీ ప్యానెల్ ఉంటుంది. ఇంకా ఈ హ్యాండ్సెట్ లో 2440 ఎంఏహెచ్ కెపాసిటీ గల డ్యూయల్-సెల్ బ్యాటరీ ఉంటుంది. టిప్‌స్టర్ ప్రకారం, ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ తో వస్తోంది. iQOO Z8 యొక్క ఇతర స్పెసిఫికేషన్స్ ఇంకా రివీల్ కాలేదు.

మరికొన్ని రోజుల్లో iQOO Z8 డివైజ్ కి సంబంధించిన సర్టిఫికేషన్స్ లేదా బెంచ్‌మార్క్స్ బయటకు వస్తాయి. అప్పుడు స్పెసిఫికేషన్స్ పై మరింత క్లారిటీ వస్తుంది. ఆగస్టు నెలలో చైనాలో ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. Z7 కి సక్సెసర్ గా iQOO Z8 వస్తున్నందున ఓసారి iQOO Z7 స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్ వేద్దాం.

iQOO Z7 చైనా వేరియంట్ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Z7 లో ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 19:9 యాస్పెక్ట్ రేషియో, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • చిప్సెట్: iQOO Z7 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z7 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • రియర్ కెమెరా: iQOO Z7 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: iQOO Z7 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంది.
  • బ్యాటరీ: iQOO Z7 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

iQOO Z7 ఇండియన్ వేరియంట్ స్పెసిఫికేషన్స్

iQOO Z7 ఇండియన్ వేరియంట్ లో 6.38-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్, డైమెన్సిటీ 920 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 64ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంది. ఈ డివైజ్ నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Previous articleహార్ట్ రేట్ మానిటర్, బాడీ టెంపరేచర్ సెన్సర్ తో Smart Ring ని అనౌన్స్ చేసిన boAt
Next articleజులై 25 న లాంచ్ కానున్న OPPO K11 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.