లాంచ్‌కి ముందు లీకైన Honor 90 భారత మార్కెట్ ధర!

Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Honor 90
  • సెప్టెంబర్ మూడో వారంలో లాంచ్ అయ్యే అవకాశం
  • Honor 90 ధర రూ.50,000 లోపు ఉంటుందని సమాచారం

చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Honor త్వరలో భారత మార్కెట్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వనుంది. Honor 90 అనే డివైజ్ తో చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత హానర్ బ్రాండ్ మళ్ళీ ఇండియాకి వస్తోంది. Honor 90 గురించి అప్పుడే పలు రకాల రూమర్లు బయటకు వస్తున్నాయి. లాంచ్ టైమ్ లైన్, ధర పై లీక్స్ వెల్లువెత్తుతున్నాయి. Honor 90 డివైజ్ ధర, లాంచ్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Honor 90 భారత మార్కెట్ ధర

IANS రిపోర్ట్ ప్రకారం, Honor 90 డివైజ్ భారతీయ మార్కెట్ లో రూ.45,000 ధరతో లాంచ్ కానుంది. అయితే ఇది ప్రారంభ ధరా? లేదా ఈ డివైజ్ సింగిల్ స్టోరేజీతో లాంచ్ అవుతుందా? అనే విషయాలు ఇంకా తెలియదు.

Honor 90 స్మార్ట్ ఫోన్ చైనాలో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 12జిబి+256జిబి, 16జిబి+256జిబి మరియు 16జిబి+512జిబి. వీటి ధరలు వరుసగా CNY 2,499 (సుమారు రూ.28,705), CNY 2,799 (సుమారు రూ.32,163), CNY 2,999 (సుమారు రూ.34,447) గా ఉన్నాయి.

Honor 90 ఇండియా లాంచ్ టైమ్‌లైన్

Honor 90 స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ ఇంకా రివీల్ కాలేదు. సెప్టెంబర్ మూడో వారంలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, కంపెనీ నుంచి మాత్రం ఇంకా అధికార ప్రకటన రాలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Honor 90 స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్

Honor 90 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా 4 కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. అవి: పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్.

  • డిస్ప్లే: Honor 90 లో 6.7-ఇంచ్ అమోలెడ్ క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ స్క్రీన్ ఉంటుంది.
  • రియర్ కెమెరా: Honor 90 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.
  • సెల్ఫీ కెమెరా: Honor 90 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • చిప్సెట్: Honor 90 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ చిప్ వాడారు.
  • స్టోరేజీ: Honor 90 డివైజ్ 8జిబి+256జిబి, 12జిబి+256జిబి, 12జిబి+512జిబి మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Honor 90 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 66 వాట్ సూపర్‌చార్జ్ టెక్నాలజీతో వస్తోంది.
  • కనెక్టివిటీ: Honor 90 లో బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ వంటి ఆప్షన్స్ ఉంటాయి.