
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme త్వరలోనే Realme GT 5 ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా Realme GT 5 మరియు Realme GT 5 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా Realme GT 5 Pro గురించి లీక్ ద్వారా ప్రాసెసర్, కెమెరా సమాచారం బయటకు వచ్చింది. తొలుత Realme GT 5 Pro డివైజ్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఈ డివైజ్ ప్రవేశించనుంది.
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Realme GT 5 Pro డివైజ్ కి సంబంధించిన సమాచారాన్ని మైక్రో-బ్లాగింగ్ సైట్ వీబో పై షేర్ చేసింది.
Realme GT 5 Pro లాంచ్ టైమ్‌లైన్
Realme GT 5 Pro, Realme GT 5 డివైజెస్ వేర్వేరు సమయంలో లాంచ్ చేయబడనున్నాయని సమాచారం. లాంచ్ టైమ్‌లైన్ గురించి మాట్లాడితే, Realme GT 5 ఆగస్టులో ఎంట్రీ ఇవ్వనుంది. మరోవైపు Realme GT 5 Pro డివైజ్ నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో లాంచ్ అవ్వనుంది.
Realme GT 5 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- చిప్సెట్: Realme GT 5 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ తో రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాసెసర్ ఇంకా లాంచ్ కాలేదు. అక్టోబర్ లో అఫీషియల్ గా ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని క్వాల్కమ్ సంస్థ లాంచ్ చేసే అవకాశం ఉంది.
- కెమెరా: Realme GT 5 Pro డివైజ్ పెరిస్కోప్ కెమెరాతో రానుందని సమాచారం. ఇంకా ఇది 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఆప్షన్ ని కలిగి ఉంటుందట. మెయిన్ కెమెరా 64ఎంపి ఒమ్నివిజన్ ఓవీ64బి సెన్సర్ అని తెలుస్తోంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది. అయితే సోని ఐఎంఎక్స్ సెన్సర్ కూడా ఉండే అవకాశం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు.
Realme GT 5 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Realme GT 5 లో 6.74-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ సపోర్ట్ ఉంటాయి.
- చిప్సెట్: Realme GT 5 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది. ఇది ఎక్స్-యాక్సిస్ ఆప్టిక్ మోటర్ తో వస్తోంది.
- స్టోరేజీ: Realme GT 5 లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: Realme GT 5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
- బ్యాటరీ: Realme GT 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 240 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ కాంబినేషన్ లో మరొక వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
- ఓఎస్: Realme GT 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Realme GT 5 లో ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.











