
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Honor కొన్నేళ్ళ తర్వాత తిరిగి భారతగడ్డపై ఒక ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. తన రీఎంట్రీని హానర్ సంస్థ గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది. అద్భుతమైన ఫోన్ తో యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు హానర్ రెడీగా ఉంది. Honor 90 డివైజ్ ఈ సెప్టెంబర్ లోనే భారత్ లో లాంచ్ కానుందని స్పష్టమైంది. అయితే కచ్చితమైన తేదీ ఇంకా ప్రకటించబడలేదు.
తాజాగా Honor 90 డివైజ్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా సేల్ కి వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అమెజాన్ సైట్ లో ఒక మైక్రోసైట్ ద్వారా Honor 90 స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి.
భారత్ లో అమెజాన్ ద్వారా లభ్యం కానున్న Honor 90
అమెజాన్ లో Honor 90 యొక్క మైక్రోసైట్ ప్రత్యక్షమైంది. దీంతో కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. Honor 90 1.5కే రెజుల్యూషన్ డిస్ప్లే, 1600 నిట్స్ బ్రైట్నెస్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ తో వస్తోంది. ఇంకా Honor 90 గూగుల్ యాప్స్ తో వస్తున్నట్లు ఇప్పటికే హానర్ కంపెనీ స్పష్టం చేసింది.
Honor 90 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Honor 90 లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1200*2664 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 435 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి.
- ప్రాసెసర్: Honor 90 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 644 జీపీయూ ఉండనుంది.
- ర్యామ్, స్టోరేజీ: Honor 90 డివైజ్ 8జిబి/12జిబి/16జిబి ర్యామ్ మరియు 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Honor 90 డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200 ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- సాఫ్ట్ వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Honor 90 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











