
చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ Infinix భారతీయ మార్కెట్ లో Infinix Zero 30 5G అనే కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి వచ్చే జీరో సిరీస్ ఫోన్లు అద్భుతమైన స్పెసిఫికేషన్స్ తో వస్తాయి. ఈసారి కూడా Infinix Zero 30 5G యూజర్ల అంచనాలకు తగినట్లే ఉంది. Infinix Zero 30 5G లో 21జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఉంది. ఇంకా ఈ ఫోన్ 50ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Infinix Zero 30 5G డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
భారత్ లో Infinix Zero 30 5G ధర
Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ గల బేస్ వేరియంట్ ధరను రూ.23,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ గల టాప్ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ రోమ్ గ్రీన్, గోల్డెన్ అవర్ అనే రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లెదర్ బ్యాక్ ఫినిష్ తో వచ్చింది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ రెండు మెమొరీ వేరియంట్స్ పై వర్తిస్తుంది. ఫ్లిప్కార్ట్ (Flipkart) ద్వారా ఈ డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.
Infinix Zero 30 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ టెక్నాలజీ ఉన్నాయి.
- ప్రాసెసర్: Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ77 జీపీయూ వినియోగించారు.
- ఓఎస్: Infinix Zero 30 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- రియర్ కెమెరా: Infinix Zero 30 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, ఏఐ సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
- ఫ్రంట్ కెమెరా: Infinix Zero 30 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి కెమెరా అందించారు. వ్లాగింగ్ చేసే వారికి 50ఎంపి ఫ్రంట్ కెమెరా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
- బ్యాటరీ: Infinix Zero 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











