
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Realme ఒక కొత్త ఫోన్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. Realme Narzo 60x 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ ఈ వారంలోనే లాంచ్ కానుంది. ఇటీవలె రియల్మీ కంపెనీ Realme C51 డివైజ్ ని విడుదల చేసింది. ఇప్పుడు Realme Narzo 60x 5G ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. Realme Narzo 60x 5G తో పాటు Realme Buds T300 కూడా లాంచ్ కానుంది.
Realme Narzo 60x 5G ఇండియా లాంచ్
సెప్టెంబర్ 6 న భారత్ లో Realme Narzo 60x 5G డివైజ్ లాంచ్ కానుంది. లాంచ్ ఈవెంట్ 6 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. రియల్మీ అధికార వెబ్‌సైట్, రియల్మీ ఇండియా యొక్క అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కార్యక్రమాన్ని చూడవచ్చు.
Realme Narzo 60x 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Realme Narzo 60x 5G లో 6.72-ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Realme Narzo 60x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ ఉంటుంది.
- ఓఎస్: Realme Narzo 60x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కెమెరా: Realme Narzo 60x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి కెమెరా అందించారు.
- బ్యాటరీ: Realme Narzo 60x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











