
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలోనే ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Vivo Y17s అనే పేరుతో వచ్చే ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో Vivo Y17s డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo Y17s స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo Y17 కి అప్‌గ్రేడ్ వర్షన్ గా వస్తోన్న Vivo Y17s
Vivo Y17s డివైజ్ గతంలో వచ్చిన Vivo Y17 కి అప్‌గ్రేడ్ వర్షన్ గా మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. Vivo Y17 ధర రూ.10,000 లోపు ఉంది. అయితే, Vivo Y17s డివైజ్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే కంపెనీ నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.
Vivo Y17s స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Vivo Y17s డివైజ్ లో 6.55-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo Y17s లో మీడియాటెక్ హీలియో జీ37 ఆక్టా-కోర్ చిప్ ఉంటుంది. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
- ర్యామ్ మెమొరీ: Vivo Y17s డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. 128జిబి వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం.
- కెమెరా: Vivo Y17s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి.
- బ్యాటరీ: Vivo Y17s లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియలేదు.











