
యాపిల్ మరోసారి తన బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ఈ బ్రాండ్ సంవత్సరానికి ఒకసారి తన కొత్త ‘iPhone’ సిరీస్ ని తీసుకొస్తోంది. ఇక ఈ లైనప్ లో వచ్చే ఫోన్లు ఏడాది పొడవునా హల్‌చల్ చేస్తాయి. iPhone 15 సిరీస్ లాంచ్ కోసం ఆపిల్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వచ్చే వారం సెప్టెంబర్ 12 న, ఐఫోన్ 15 సిరీస్ భారతదేశంలో లాంచ్ అవుతోంది. ఇది చాలా అధునాతన సాంకేతికత మరియు శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. మీరు మార్కెట్లోకి రాకముందే కొత్త ఆపిల్ ఐఫోన్‌కు సంబంధించిన అన్ని లీకైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
iPhone 15 డిజైన్
iPhone 15 సిరీస్ ఫోన్లలో లైట్నెంగ్ పోర్ట్ స్థానంలో యూఎస్బీ-సీ పోర్ట్ ఉండనుంది. ఇంకా గ్లాస్, మెటల్ ఫ్రేమ్ ఎడ్జెస్ కర్వ్డ్ గా ఉండనున్నాయి. టైటానియమ్ ఫ్రేమ్ ని ఈ లైనప్ లో వచ్చిన ఫోన్లలో వాడారు. వాల్యూమ్ రాకర్స్, మ్యూట్ స్విచెస్ లో మార్పులు ఉంటాయని లీకైన పిక్స్ ద్వారా తెలుస్తోంది. ఫిజికల్ బటన్స్ స్థానంలో కెపాసిటివ్ బటన్స్ ఉంటాయని తెలుస్తోంది.
iPhone 15 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ
iPhone 15 సిరీస్ స్మార్ట్ ఫోన్లు సెప్టెంబర్ 12 వ తేదీన భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ లైనప్ లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈసారి కంపెనీ iPhone 15 Ultra మోడల్ ని కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం.
iPhone 15 సిరీస్ ధర (లీక్)
- రీసెంట్ గా ఒక రిపోర్ట్ ద్వారా iPhone 15 సిరీస్ ధరలు లీక్ అయ్యాయి. దాని ప్రకారం, ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- iPhone 15 ధర 999 డాలర్లుగా ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.81,900 ఉండవచ్చు.
- iPhone 15 Plus ధర 1099 డాలర్లుగా ఉండవచ్చు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.89,900 గా ఉండే అవకాశం ఉంది.
- iPhone 15 Pro డివైజ్ ధర 1199 డాలర్లు గా ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీలో దీని ధర సుమారు రూ.98,900 గా ఉండవచ్చు.
- iPhone 15 Pro Max ధర 1299 డాలర్లు గా ఉంటుందని సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1,06,900 గా ఉండవచ్చు.
- భారతీయ మార్కెట్ కంటే యూఎస్ లో iPhone 15 సిరీస్ ఫోన్ల ధర తక్కువగా ఉంటుంది.
iPhone 15 కలర్ ఆప్షన్స్
iPhone 15 సిరీస్ ఫోన్లు వివిధ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. iPhone 15, iPhone 15 Plus ఫోన్లు గ్రీన్ కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటాయి. iPhone 15 Pro క్రిమ్సన్ కలర్ ఆప్షన్ లో లభించనున్నట్లు సమాచారం. లైట్ బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు.
iPhone 15 స్పెసిఫికేషన్స్ (లీక్)
- స్క్రీన్: iPhone 15 లో 6.1-ఇంచ్ డైనమిక్ ఐల్యాండ్ నాచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: iPhone 15 లో ఆపిల్ బయోనిక్ ఏ16 చిప్సెట్ ఉంటుందని సమాచారం. iPhone 15 Pro, Pro Max లలో బయోనిక్ ఏ17 చిప్ ఉంటుంది.
- బ్యాటరీ: iPhone 15 లో పవర్ బ్యాకప్ కోసం 3877 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ప్లస్ మోడల్ లో 4912 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. iPhone 14 తో పోల్చితే ఇది చెప్పుకోదగిన మార్పు అని భావించవచ్చు.
- కెమెరా: iPhone 15 సిరీస్ ఫోన్లలో 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 48ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటాయి. ప్రో మోడల్స్ లో 48ఎంపి సోని ఐఎంఎక్స్9-సిరీస్ సెన్సర్ ఉంటుంది. బేస్ మరియు ప్లస్ మోడల్స్ లో 48ఎంపి సోని ఐఎంఎక్స్803 సెన్సర్ ఉంటుంది.











