
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo గత నెలలో V29 5G డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని వివో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. Vivo V29 Pro 5G అతి త్వరలో లాంచ్ కానుందని రూమర్లు కూడా వచ్చాయి. Vivo V29 5G, Vivo V29 Pro 5G డివైజెస్ ఈ నెలాఖరులో లాంచ్ అవుతున్నాయని 91మొబైల్స్ కి ఎక్స్క్లూజివ్ గా సమాచారం అందింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
భారత్ లో Vivo V29 5G, Vivo V29 Pro 5G లాంచ్
సెప్టెంబర్ నెలాఖరులో Vivo V29 5G, Vivo V29 Pro 5G స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయాలని వివో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త స్మార్ట్ఫోన్లు ఇండియా-స్పెసిఫిక్ ఫీచర్స్ తో వస్తున్నాయి. అయితే ఈ ఫీచర్లేంటో ఇంకా తెలియదు. కానీ, భారతదేశ స్పూర్తితో మెజెస్టిక్ రెడ్ కలర్ లో Vivo V29 సిరీస్ లాంచ్ కానుందని తెలుస్తోంది.
Vivo V29 5G, Vivo V29 Pro 5G ఫోన్లు ప్రీమియమ్ డిజైన్, కొత్త కలర్స్ తో లాంచ్ కానున్నాయి. Vivo V29 Pro 5G డివైజ్ ఇండియా-ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ అని తెలుస్తోంది. అంటే భారత మార్కెట్ కాకుండా మరే ఇతర మార్కెట్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ కాదు. ఇంకా లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, సెప్టెంబర్ చివర్లో లాంచ్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Vivo V29 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo V29 5G డివైజ్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- చిప్సెట్: Vivo V29 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Vivo V29 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Vivo V29 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్ వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ, చార్జింగ్: Vivo V29 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్వేర్: Vivo V29 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo V29 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











