200MP మెయిన్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరాతో లాంచైన Honor 90

Highlights

  • భారత గడ్డపై మళ్ళీ అడుగుపెట్టిన Honor
  • Honor 90 తో ఎంట్రీ ఇచ్చిన హానర్ సంస్థ
  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన డివైజ్

కొన్నాళ్ళగా భారత మార్కెట్ లో ఫోన్ ని లాంచ్ చేయని Honor సంస్థ తిరిగి ఇండియన్ మార్కెట్ కి ఎంట్రీ ఇచ్చింది. నేడు ఈ సంస్థ Honor 90 డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ డివైజ్ ఇప్పటికే గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. Honor 90 ఫోన్ ఘనమైన ఫీచర్లతో రెడీ అయి హానర్ అభిమానుల ముందుకు వచ్చింది. హానర్ నుంచి ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి నేడు పండుగేనని చెప్పాలి.

Honor 90 స్మార్ట్ ఫోన్ 200 ఎంపి మెయిన్ కెమెరా, 50 ఎంపి ఫ్రంట్ కెమెరాతో రావడం విశేషం. 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ తో ఈ ఫోన్ ఎక్విప్ అయి ఉంది. సరే, Honor 90 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor 90 ధర, సేల్ వివరాలు

Honor 90 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.37,999 గా నిర్ణయించారు. ఈ డివైజ్ 12జిబి ర్యామ్ + 512జిబి వేరియంట్ లో కూడా లభిస్తుంది. దీని ధర రూ.39,999 గా ఉంది. ఇకపోతే హానర్ సంస్థ రెండు మోడల్స్ కి కూడా ఇంట్రడక్టరీ ధర రూ.27,999 గా నిర్ణయించింది.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.
  • కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.