68W ఫాస్ట్ చార్జింగ్, 144Hz డిస్ప్లేతో గ్లోబల్‌గా లాంచైన Moto Edge 40 Neo

Highlights

  • Edge 30 Neo కి సక్సెసర్ గా వచ్చిన Moto Edge 40 Neo
  • 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన డివైజ్
  • సెప్టెంబర్ 21 న భారత్ లో లాంచ్ కానున్న డివైజ్

Moto Edge 40 Neo స్మార్ట్ ఫోన్ నేడు గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ Moto Edge 30 Neo కి సక్సెసర్ గా వచ్చింది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఎడ్జ్ 40, ఎడ్జ్ 40 ప్రో ఫోన్లకు జతచేరనుంది Moto Edge 40 Neo. Moto Edge 40 Neo విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్రీమియమ్ లుక్, ఫీల్ తో వచ్చింది. లెదర్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్ అనే రెండు డిజైన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

సెప్టెంబర్ 21 న మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో Moto Edge 40 Neo స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందని మోటోరోలా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులో ఉంటుంది.

Moto Edge 40 Neo ధర

  • Moto Edge 40 Neo డివైజ్ పాంటోన్ సూథింగ్ సీ, పాంటోన్ కనీల్ బే కలర్, పాంటోన్ బ్లాక్ బ్యూటీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Moto Edge 40 Neo ఫోన్ ధర యూరోపియన్ మార్కెట్ లో EUR 399 (సుమారు రూ.35,600) గా ఉంది.

Moto Edge 40 Neo స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Moto Edge 40 Neo లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, పంచ్-హోల్ కటౌట్, న్యారో బెజెల్స్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto Edge 40 Neo డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7030 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎంసీ3 జీపీయూ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto Edge 40 Neo డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: Moto Edge 40 Neo స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. కంపెనీ 2 ఆండ్రాయిడ్ మేజర్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని హామీనిస్తోంది.
  • కెమెరా: Moto Edge 40 Neo డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ క్వాడ్ పిక్సెల్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరాలో డెప్త్, మ్యాక్రో మోడ్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto Edge 40 Neo డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Moto Edge 40 Neo డివైజ్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Moto Edge 40 Neo డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.