లీకైన Honor 100 Pro లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్

Highlights

  • నవంబర్‌లో Honor 100 Pro లాంచ్ అయ్యే అవకాశం
  • డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా లీకైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వస్తోన్న డివైజ్

Honor 90 సిరీస్ ఇటీవలె చైనా మరియు భారతీయ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Honor 90, Honor 90 Pro ఫోన్లు వచ్చాయి. అయితే స్టాండర్డ్ మోడల్ మాత్రమే భారత్ లో అందుబాటులో ఉంది. ప్రో వేరియంట్ చైనాకు మాత్రమే పరిమితమైంది. ఇకపోతే, ఈ సిరీస్ కి అప్‌గ్రేడ్ గా Honor 100 సిరీస్ రాబోతుంది. ఈ లైనప్ లో భాగమైన Honor 100 Pro డివైజ్ యొక్క లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Honor 100 Pro లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా Honor 100 Pro స్మార్ట్‌ఫోన్ వివరాలు లీక్ చేసింది. నవంబర్ నెలలో Honor 100 Pro డివైజ్ లాంచ్ కానుందని సదరు టిప్‌స్టర్ తెలిపారు. అయితే అసలైన లాంచ్ తేదీ ఇంకా రివీల్ కాలేదు. త్వరలోనే హానర్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తొలుత ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. సరే, ఓసారి ఈ డివైజ్ కి సంబంధించిన లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Honor 100 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Honor 100 Pro లో అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. అయితే సైజ్ వివరాలు తెలియలేదు. ఈ ఫోన్ 3840 హెర్ట్జ్ సపోర్ట్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తున్నట్లు సమాచారం.
  • ప్రాసెసర్: Honor 100 Pro డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడనున్నారని తెలుస్తోంది. గ్రాఫిక్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
  • కెమెరా: Honor 100 Pro స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సెటప్ తో వస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే పవర్ఫుల్ ఫ్రంట్ కెమెరాను యూజర్లు పొందనున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీ కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చే యూజర్లకు ఈ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా బాగా ఉపయోగపడుతుంది.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Honor 90 లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 పీడబ్ల్యూఎం డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • స్టోరేజీ: Honor 90 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Honor 90 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
  • బ్యాటరీ: Honor 90 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Honor 90 లో డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.