
Redmi Note 13 సిరీస్ త్వరలో భారతదేశంలో కూడా లాంచ్ కానుంది. తొలుత చైనాలో ఈ సిరీస్ లాంచ్ కానుంది. తర్వాత ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఉంటుంది. వాస్తవానికి, చైనీస్ మార్కెట్లో రెడ్మీ 13 సిరీస్ లాంచ్ సెప్టెంబర్ 21 న ఉంటుందని రెడ్మీ కంపెనీ తెలిపింది. అదే సమయంలో, రాబోయే Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro + భారతదేశంలోకి ప్రవేశించవచ్చని ఇప్పుడు BIS జాబితా ద్వారా స్పష్టమైంది. సర్టిఫికేషన్ మరియు స్పెసిఫికేషన్లను మరింత వివరంగా తెలుసుకుందాం పదండి.
Redmi Note 13 సిరీస్ BIS లిస్టింగ్
- సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక యూజర్ భారతదేశ BIS సర్టిఫికేషన్‌లో రెండు కొత్త Redmi స్మార్ట్ఫోన్లను గుర్తించారు.
- మోడల్ నంబర్లు 2312DRAABI మరియు 2312FRAFDIతో పోస్ట్‌లో కొత్త Redmi స్మార్ట్‌ఫోన్ వివరాలను సదరు యూజర్ అందించారు.
- ఆ డివైజ్ నోట్ 13 సిరీస్ 4G మరియు 5G స్మార్ట్‌ఫోన్ అయి ఉంటుందని జాబితా ద్వారా అర్థమవుతోంది.
- లాంచ్ టైమ్‌లైన్‌కు సంబంధించిన వివరాలు చూస్తే, నవంబర్ లేదా డిసెంబర్ నెలలో నోట్ 13 సిరీస్ డివైజెస్ ని ప్రవేశపెట్టవచ్చని పోస్ట్‌లో చెప్పబడింది.
Redmi Note 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Redmi Note 13 సిరీస్ స్మార్ట్ఫోన్లలో 6.67-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Redmi Note 13 సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. Redmi Note 13 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ తో రానున్నట్లు తెలుస్తోంది.
- స్టోరేజీ: Redmi Note 13 సిరీస్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ, 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది.
- కెమెరా: Redmi Note 13 సిరీస్ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Redmi Note 13, Note 13 Pro డివైజెస్ లో పవర్ బ్యాకప్ కోసం 5120 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మరోవైపు, Note 13 Pro Plus డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.











