
ప్రముఖ టెక్ బ్రాండ్ Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Vivo V29 ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సిరీస్ లాంచ్ గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారతదేశంలో వివో వీ-సిరీస్ కి క్రేజ్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. దీంతో యూజర్లు ఈ సిరీస్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో, వివో సంస్థ Vivo V29 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.
Vivo V29 సిరీస్ లాంచ్ తేదీ
వివో సంస్థ తన అధికార X ఖాతా ద్వారా Vivo V29 సిరీస్ లాంచ్ తేదీని వెల్లడించింది. అక్టోబర్ 4 వ తేదీన భారతీయ మార్కెట్ లోకి Vivo V29 సిరీస్ ఎంట్రీ ఇవ్వబోతోంది. పోస్ట్ లో వివో, “ద వర్డ్ ఈజ్ ఔట్! #దమాస్టర్‌పీస్ వివో వీ29 సిరీస్ ఈజ్ లాంచింగ్ ఆన్ 04-10-2023 ఎట్ 12పీఎమ్” అని రాసుకొచ్చింది. పోస్ట్ తో పాటు ఒక వీడియో క్లిప్ ని జతచేసింది. ఈ వీడియో క్లిప్ లో Vivo V29 సిరీస్ లాంచ్ గురించి అడుగుతోన్న వివో ఫ్యాన్స్ ని గమనించవచ్చు.
The word is out!
The #TheMasterpiece vivo V29 Series is launching on 04-10-2023 at 12 p.m. pic.twitter.com/t0v2jP4AGf— vivo India (@Vivo_India) September 26, 2023
Vivo V29 సిరీస్ సేల్ వివరాలు
Vivo V29 సిరీస్ ఫ్లిప్‌కార్ట్, వివో యొక్క ఆన్‌లైన్ షాప్, ఇతర ఆఫ్‌లైన్ రిటైలర్స్ ద్వారా సేల్ కి వస్తుంది.
Vivo V29 సిరీస్ డిజైన్, ఇతర ఫీచర్లు
Vivo V29 సిరీస్ డివైజెస్ అల్ట్రా-స్లిమ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నాయి. ఇంకా ఈ ఫోన్ల బ్యాక్ ప్యానెల్స్ భారతదేశపు తొలి 3డీ పార్టికల్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. టీజర్ ని బట్టి, ఫోన్ బ్యాక్ ప్యానెల్ మెజెస్టిక్ షిమ్మరింగ్ లైట్స్, షాడోస్ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. 3డీ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ద్వారి ఇది సాధ్యమవుతుంది. ఇంకా ఫోన్ స్లిమ్, లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫోన్ 0.746 సె.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.
Vivo V29 సిరీస్ స్మార్ట్ ఆరా లైట్ ఫీచర్ తో వస్తోంది. దీని ద్వారా నైట్ పొట్రెయిట్స్ ని మెరుగ్గా తీయవచ్చు. అలాగే లైట్ ఇంటెన్సిటీని కూడా అడ్జస్ట్ చేసుకునే వీలుంది. స్మార్ట్ కలర్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, ఇండియా ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్ స్టైల్ పొట్రెయిట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Vivo V29 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo V29 5G లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే (2800*1260 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, హెచ్డీఆర్10+ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ఉంటాయి.
- మెమొరీ: Vivo V29 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
- రియర్ కెమెరా: Vivo V29 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. వీటికి తోడు ఆరా లైట్ ఫ్లాష్ ఉంటుంది.
- ఫ్రంట్ కెమెరా: Vivo V29 5G లో 50ఎంపి సెల్ఫీ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
- బ్యాటరీ, చార్జింగ్: Vivo V29 5G లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
- భద్రత: Vivo V29 5G లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.
- ఆడియో: Vivo V29 5G లో స్టీరియో స్పీకర్ సెటప్, హై-రెజుల్యూషన్ ఆడియో ఉంటాయి.
- కనెక్టివిటీ: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్ ఉంటాయి.
- కలర్ ఆప్షన్స్: Vivo V29 5G డివైజ్ పీక్ బ్లూ, నోబుల్ బ్లాక్ కలర్స్ లో లభ్యమవుతుంది.
- బరువు, చుట్టు కొలత: Vivo V29 5G డివైజ్ 164.18 మి.మీ పొడవు, 74.37 మి.మీ వెడల్పు, 7.46 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.











