
షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలోనే Redmi 13C డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా Redmi 13C యొక్క హై-క్వాలిటీ ఇమేజెస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. MySmartPrice ఈ ఇమేజెస్ ని రివీల్ చేసింది. రివీలైన ఇమేజెస్ ద్వారా Redmi 13C పూర్తి డిజైన్, కలర్ ఆప్షన్స్ వివరాలు తెలిసాయి. ఈ హ్యాండ్సెట్ మార్చి నెలలో లాంచైన Redmi 12C కి సక్సెసర్ గా వస్తోంది. సరే, ఓసారి Redmi 13C డివైజ్ యొక్క డిజైన్, తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Redmi 13C డిజైన్
- Redmi 13C ఫోన్ బడ్జెట్ డిజైన్ లో వస్తోంది. రెండర్స్ ని బట్టి ఇది స్పష్టమవుతోంది.
- ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉంది. అలాగే కాస్త మందపాటి బెజెల్స్ కనిపిస్తున్నాయి.
- ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. సిమ్ ట్రే ఫోన్ కి ఎడమవైపున ఉంది.
- Redmi 13C బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్-సర్క్యులర్ రింగ్స్ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. మాడ్యూల్ పైన 50ఎంపి అని టెక్స్ట్ ఉంది.
- డివైజ్ కి బాటమ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ ఉన్నాయి.
- Redmi 13C డివైజ్ గ్రీన్, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ఈ ఫోన్ పాలికార్బొనేట్ బాడీతో తయారైంది. ధరను తగ్గించేందుకు లో-బడ్జెట్ డివైజెస్ లో ప్లాస్టిక్ ఫ్రేమ్, బాడీ వాడటం సాధరణ విషయమే.
- Redmi 13C హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ప్రస్తుతానికి రహస్యంగానే ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Redmi 12C స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi 12C డివైజ్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్‌డ్రాప్ నాచ్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi 12C లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi 12C లో 6జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
- ఓఎస్: Redmi 12C డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi 12C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Redmi 12C డివైజ్ లో 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్ ఉన్నాయి.











