
OPPO సంస్థ తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ OPPO Find N3 Flip ని చైనాలో ఇప్పటికే లాంచ్ చేసింది. త్వరలోనే భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లోకి కూడా ఈ డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఒప్పో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు, OPPO Find N3 Flip డివైజ్ ఇండియన్ వేరియంట్ ఫ్రంట్ స్క్రీన్ ఫోటో లీక్ అయ్యింది. భారత్ లో వాడబడే యాప్స్ ఆ ఫోటో లో కనిపిస్తున్నాయి. సరే, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
OPPO Find N3 Flip 5G లైవ్ ఫోటో
- OPPO Find N3 Flip 5G డివైజ్ ఫోటో ఇండియన్ మోడల్దేనని 91మొబైల్స్ కి ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసాయి.
- త్వరలోనే OPPO Find N3 Flip 5G డివైజ్ భారత్ లో లాంచ్ కానుందని క్లారిటీ వచ్చింది.
- OPPO Find N3 Flip 5G ఫోన్ సిల్వర్ కలర్ ఆప్షన్ లో లభించనుందని తెలుస్తోంది. ఇది చైనాలో అందుబాటులో లేదు. అంటే భారత్ లో మాత్రమే ఈ కలర్ వేరియంట్ లభించనుందని తెలుస్తోంది.
- ఇక లీకైన OPPO Find N3 Flip 5G ఫోటో లో చూసినట్లయితే జొమాటో, ఎమ్ఆధార్, జెరోదా వంటి ఇండియన్ యాప్స్ ఉన్నాయి.
- ఇంకా వాట్సాప్, యూట్యూబ్, ఉబర్, గూగుల్ పే వంటి గ్లోబల్ యాప్స్ కూడా ఉన్నాయి.
OPPO Find N3 Flip 5G స్పెసిఫికేషన్స్ (చైనా)
- డిస్ప్లే: OPPO Find N3 Flip 5G లో 6.80-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఇన్నర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.
- చిప్సెట్: OPPO Find N3 Flip 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం మాలి-జీ715 ఇమ్మోర్టాలిస్ ఎమ్పీ11 జీపీయూ వినియోగించారు.
- కెమెరా: OPPO Find N3 Flip 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: OPPO Find N3 Flip 5G లో పవర్ బ్యాకప్ కోసం 4300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OPPO Find N3 Flip 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OPPO Find N3 Flip 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్సీ ఉన్నాయి.











