
Vivo V29 సిరీస్ నేడు భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. అవి: Vivo V29, Vivo V29 Pro. Vivo V29 సిరీస్ డివైజెస్ 12జిబి వరకు ర్యామ్, ఆరా లైట్, 6.78-ఇంచ్ భారీ అమోలెడ్ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఈ ఆర్టికల్ లో స్టాండర్డ్ మోడల్ Vivo V29 ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo V29 ధర, లభ్యత
- Vivo V29 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.
- Vivo V29 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది. టాప్ వేరియంట్ ధరను రూ.36,999 గా నిర్ణయించారు.
- స్పేస్ బ్లాక్, మ్యాజికల్ రెడ్, హిమాలయన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
- అక్టోబర్ 17 నుంచి ఫ్లిప్కార్ట్, వివో వెబ్సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్లెట్స్ ద్వారా సేల్ మొదలవుతుంది.
- నేటి నుంచి Vivo V29 సిరీస్ ఫోన్ల ప్రీ-బుకింగ్ కూడా మొదలైంది.
Vivo V29 కెమెరా విశేషాలు
- Vivo V29 డివైజ్ ప్రత్యేకత ఏంటంటే, ఎక్స్లెంట్ కెమెరాను ఈ ఫోన్ అందిస్తోంది. 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం.
- ఇంకా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 50ఎంపి ప్రైమరీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంది. అలాగే 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి.
- బ్యాక్ కెమెరాలో ఆరా లైట్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని ద్వారా నైట్ ఫోటోగ్రఫీ మరింత మెరుగు కానుంది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి కూడా ఈ ఫోన్ ఉత్తమమైన ఆప్షన్ అని కంపెనీ చెబుతోంది. సరే, ఓసారి Vivo V29 డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Vivo V29 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Vivo V29 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ వాడారు.
- స్టోరేజీ: Vivo V29 5G డివైజ్ 8జిబి+128జిబి మరియు 12జిబి+256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Vivo V29 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Vivo V29 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు: Vivo V29 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
- చుట్టుకొలత, బరువు: Vivo V29 5G డివైజ్ 164.18 మి.మీ పొడవు, 74.37 మి.మీ వెడల్పు, 7.46 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.











