
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo నేడు భారతీయ మార్కెట్ లో Oppo A18 డివైజ్ ని లాంచ్ చేసింది. ఇంతకు ముందు ఈ ఫోన్ యూఏఈ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. భారత్ లో కూడా అవే స్పెసిఫికేషన్స్ తో Oppo A18 ఎంట్రీ ఇచ్చింది. Oppo A18 ధరను రూ.9,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది. ఓసారి Oppo A18 యొక్క ధర, ఆఫర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Oppo A18 ధర, లభ్యత
Oppo A18 స్మార్ట్ ఫోన్ లాంచ్ సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై కంపెనీ తెలియజేసింది. అలాగే తన అధికార వెబ్‌సైట్ లో కూడా డివైజ్ ని లిస్ట్ చేసింది.
Prepare to be amazed by the all-new OPPO A18, loaded with incredible features like 4GB RAM + 64GB ROM, side fingerprint lock, 300% ultra volume mode, and much more
Make it yours at just Rs 9,999!
Available Now: https://t.co/Ap2lOB1ESd pic.twitter.com/GYvQdUXqCD
— OPPO India (@OPPOIndia) October 5, 2023
- Oppo A18 డివైజ్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది.
- 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999 గా ఉంది.
- గ్లోయింగ్ బ్లూ, గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
- ఎస్బీఐ, వన్‌కార్డ్, ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కార్డ్స్ పై ఒప్పో కంపెనీ రూ.1,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.
- అంతేకాదు, Oppo A18 కొనుగోలుపై లక్కీ డ్రా ఆఫర్ ద్వారా Oppo Enco Buds 2 ని ఉచితంగా గెలుచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది.
Oppo A18 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Oppo A18 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 89.80 పర్సెంట్ స్క్రీన్ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 90 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 16.7 బిలియన్ కలర్స్, 720 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Oppo A18 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి జీజీ52 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
- మెమొరీ: Oppo A18 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ఉంది. దీంతో యూజర్ కి 8జిబి ర్యామ్ లభిస్తుంది. Oppo A18 లో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ ఈఎంఎంసీ5.1 స్టోరేజీ టెక్నాలజీ వాడారు.
- కెమెరా: Oppo A18 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. నైట్ వీడియో, ఫోటో పొట్రెయిట్, టైమ్‌ల్యాప్స్, ప్రో, ప్యానో, గూగుల్ లెన్స్ వంటి కెమెరా ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
- బ్యాటరీ: Oppo A18 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
- ఓఎస్: Oppo A18 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Oppo A18 లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.3, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.











