11.35-ఇంచ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన OnePlus Pad Go

Highlights

  • హీలియో జీ99 చిప్ తో వచ్చిన OnePlus Pad Go
  • అక్టోబర్ 20 నుంచి భారత్ లో OnePlus Pad Go సేల్
  • OnePlus Pad Go ధర రూ.19,999

ప్రముఖ టెక్ బ్రాండ్ OnePlus భారతీయ మార్కెట్ లో OnePlus Pad Go ట్యాబ్లెట్ ని లాంచ్ చేసింది. ఫిబ్రవరిలో తొలిసారిగా వన్‌ప్లస్ తన మొదటి ట్యాబ్లెట్ ని పరిచయం చేసింది. తాజాగా వచ్చిన OnePlus Pad Go డివైజ్ రెండోది. కాగా, ఈ ట్యాబ్లెట్ ధరను భారత్ లో రూ.20,000 గా నిర్ణయించారు. ఈ డివైజ్ 11.35-ఇంచ్ డిస్ప్లే, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వచ్చింది.

భారత్ లో OnePlus Pad Go ట్యాబ్లెట్ ధర, లభ్యత

OnePlus Pad Go 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. ఇది వై-ఫై మోడల్ ధర. 8జిబి+128జిబి ఎల్టీఈ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. వై-ఫై మోడల్ 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.23,999 గా ఉంది. అక్టోబర్ 12 నుంచి ఈ ట్యాబ్లెట్ యొక్క ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రిలయన్స్, క్రోమా మరియు ఇతర ముఖ్యమైన ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అక్టోబర్ 20 నుంచి OnePlus Pad Go ట్యాబ్లెట్ ని కొనుగోలు చేయవచ్చు.

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, OnePlus Pad Go డివైజ్ పై రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.1,399 విలువగల ఫోలియో కవర్ యూజర్లకు ఉచితంగా లభించనుంది. ఈ ట్యాబ్లెట్ ట్విన్ మింట్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.

OnePlus Pad Go స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • డిస్ప్లే: OnePlus Pad Go లో 11.35-ఇంచ్ డిస్ప్లే, 400 నిట్స్ బ్రైట్నెస్, 2.4కే రెజుల్యూషన్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 7:5 యాస్పెక్ట్ రేషియో, 260పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 86.40 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus Pad Go లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంపీ2 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: OnePlus Pad Go డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ (ఎల్టీఈ) మరియు 8జిబి ర్యామ్, 128/256జిబి స్టోరేజీ (వై-ఫై వేరియంట్) లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: OnePlus Pad Go డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OnePlus Pad Go లో పవర్ బ్యాకప్ కోసం 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Pad Go లో వై-ఫై, ఎల్టీఈ సపోర్ట్ (ఆప్షనల్), బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: OnePlus Pad Go లో ఫేస్ అన్‌లాక్, క్వాడ్ స్పీకర్, డాల్బి అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి.
Previous articleశాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌తో రానున్న Vivo X100 Pro
Next articleసీక్రెట్ కోడ్స్ ఫీచర్‌ని తీసుకురానున్న WhatsApp
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.