
OPPO సంస్థ త్వరలో ఒక బడ్జెట్ 5జీ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. భారత్ లో కూడా ఈ డివైజ్ ఎంట్రీ ఇవ్వనుంది. OPPO A58 కి సక్సెసర్ గా వస్తోన్న ఈ డివైజ్ OPPO A59 5G పేరుతో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ బ్యూరో ఆఫర్ ఇండియన్ స్టాండర్డ్స్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై కనిపించింది. దీంతో భారత మార్కెట్ లాంచ్ పై స్పష్టత వచ్చింది. సరే, OPPO A59 5G డివైజ్ యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ తో పాటు సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.
OPPO A59 5G సర్టిఫికేషన్ లిస్టింగ్
- బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై CPH2617 మోడల్ నంబర్ తో OPPO A59 5G కనిపించింది.
- మోడల్ నంబర్ కాకుండా మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.
- అయితే బీఐఎస్ పై కనిపించింది కాబట్టి, ఇండియాలో లాంచ్ త్వరలోనే ఉంటుందని అనుకోవచ్చు.
- ఇక బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ గురించి మాట్లాడితే, ఈ సైట్ లో కూడా CPH2617 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా OPPO A59 5G డివైజ్ 5.3 బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తోందని తెలిసింది.
- OPPO A59 5G స్పెసిఫికేషన్స్ ఇంకా వెల్లడి కాలేదు కావున, గత మోడల్ OPPO A58 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
OPPO A58 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO A58 5G లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ (720*1612 పిక్సెల్స్) రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO A58 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ వాడారు. ఇది 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
- మెమొరీ: OPPO A58 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- కెమెరా: OPPO A58 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: OPPO A58 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OPPO A58 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











