
OPPO సంస్థ OPPO Find N3 ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. చైనాతో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో ఈ డివైజ్ లాంచ్ అయ్యింది. స్పెసిఫికేషన్స్ చూస్తే, OPPO Find N3 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 7.8-ఇంచ్ ఇంటర్నల్ స్క్రీన్, 6.31-ఇంచ్ కవర్ స్క్రీన్ ఉంటాయి. మరో విషయం ఏంటంటే, నేడు భారతీయ మార్కెట్ లో లాంచ్ కాబోయే OnePlus Open హ్యాండ్సెట్ OPPO Find N3 మాదిరి డిజైన్, స్పెసిఫికేషన్స్ తో వస్తోంది.
OPPO Find N3 ధర, కలర్ ఆప్షన్స్
- OPPO Find N3 డివైజ్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ఆప్షన్ లో లాంచ్ అయ్యింది.
- OPPO Find N3 ధరను SGD 2,399 (సుమారు రూ.1,45,400) గా నిర్ణయించారు. అక్టోబర్ 20 వ తేదీ నుంచి ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కి అందుబాటులోకి వస్తుంది.
- నాలుగు కలర్ ఆప్షన్స్, రెండు ఫినిషింగ్స్ లో OPPO Find N3 వచ్చింది.
- బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్స్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చాయి. గ్రీన్, గ్లోల్డ్ కలర్ వేరియంట్స్ మ్యాట్ గ్లాస్ ఫినిష్ తో వచ్చాయి. ఇవే కాకుండా, షాంపేన్ గోల్డ్ మోడల్ కూడా ఉంది.
OPPO Find N3 స్పెసిఫికేషన్స్
- ఔటర్ డిస్ప్లే: OPPO Find N3 లో 6.31-ఇంచ్ 2484*116 పిక్సెల్స్ అమోలెడ్ ప్యానెల్, డైనమిక్ 10Hz-120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2,800 పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ఇన్నర్ డిస్ప్లే: OPPO Find N3 ని తెరిచినప్పుడు 7.82-ఇంచ్ 2440*2268 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల డిస్ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
- ప్రాసెసర్: OPPO Find N3 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 3.2గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.
- మెమొరీ: OPPO Find N3 లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి.
- బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం OPPO Find N3 లో 4,805 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఫ్రంట్ కెమెరా: OPPO Find N3 లో 20ఎంపి ఇన్నర్ ఫ్రంట్ కెమెరా, 32ఎంపి కవర్ స్క్రీన్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
- రియర్ కెమెరా: OPPO Find N3 లో 48ఎంపి 14ఎంఎం అల్ట్రావైడ్ లెన్స్, 64ఎంపి 6x హైబ్రిడ్ జూమ్ పెరిస్కోప్ లెన్స్, 48ఎంపి సోని LYTIA-T808 పిక్సెల్ స్టాక్డ్ సెన్సర్ ఉన్నాయి.
- ఓఎస్: OPPO Find N3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.











