
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో Vivo Y200 5G డివైజ్ ని లాంచ్ చేసింది. వై-సిరీస్ లో వచ్చిన ఈ లేటెస్ట్ 5జీ డివైజ్ 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్, 128జిబి స్టోరేజీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చింది. సరే, ఓసారి Vivo Y200 5G డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Vivo Y200 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్
- Vivo Y200 5G స్మార్ట్ ఫోన్ ధరను భారత్ లో రూ.21,999 గా నిర్ణయించారు.
- లాంచ్ ఆఫర్ లో భాగంగా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ అలాగే డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.
- వివో ఇండియా వెబ్సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా Vivo Y200 5G ని కొనుగోలు చేయవచ్చు.
- Vivo Y200 5G డివైజ్ డెజర్ట్ గోల్డ్, డెజర్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
Vivo Y200 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
- ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
- ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.











