IP68, IP69 సర్టిఫికేషన్‌తో లాంచైన Doogee Smini కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్; దుమ్ము, నీరు.. దేన్నైనా తట్టుకుని నిలిచే ఫోన్!

Highlights

  • చైనాలో లాంచైన Doogee Smini
  • 4.15-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Doogee Smini బరువు: 155 గ్రాములు

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Doogee తాజాగా తన హోమ్ మార్కెట్ లో ఒక దృఢమైన ఫోన్ Doogee Smini ని లాంచ్ చేసిందని Gizmochina ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ రగ్డ్ ఫోన్ కాంపాక్ట్ సైజ్ కలిగి ఉంటుంది. ఈ తరహా ఫోన్లను ఇష్టపడే వారికి Doogee Smini మంచి ఆప్షన్ గా నిలవనుంది. Doogee Smini ఐపీ68, ఐపీ69 సర్టిఫికేషన్ తో వచ్చింది. దుమ్ము, ధూళీ, నీటిని తట్టుకుని నిలబడే దృఢత్వాన్ని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. సరే, ఓసారి Doogee Smini ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Doogee Smini ధర

  • Doogee Smini ప్రస్తుతం అలీఎక్స్‌ప్రెస్ పై కొనుగోలుకి అందుబాటులో ఉంది. వివిధ రకాల కరెన్సీలను ఈ సైట్ యాక్సెప్ట్ చేస్తుంది.
  • అయితే షిప్పింగ్ ఫీజులు, ఇంపోర్ట్ ట్యాక్సెస్, లొకేషన్‌ని బట్టి ఇతర ఖర్చులను కొనుగోలుదారులు భరించాల్సి ఉంటుంది.

Doogee Smini స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Doogee Smini లో 4.5-ఇంచ్ ఐపీఎస్ ప్యానెల్, 1,170*480 పిక్సెల్స్ రెజుల్యూషన్, 281 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • డైమెన్షన్స్: Doogee Smini డివైజ్ 133 మి.మీ పొడవు, 60మి.మీ వెడల్పు, 13.5 మి.మీ మందం, 155 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఐఫోన్ 13 మినీ కన్నా చిన్నగా ఉంటుంది.
  • బిల్డ్ క్వాలిటీ: Doogee Smini డివైజ్ ఐపీ68, ఐపీ69కే సర్టిఫికేషన్ తో రావడం వల్లన డస్ట్, వాటర్ నుంచే కాకుండా కఠినమైన పరిస్ఠితులను సైతం తట్టుకుని నిలవగలదు.
  • కెమెరా: Doogee Smini లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది 3డీ ఫేషియల్ రికగ్నిషన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి కెమెరా ఉన్నాయి.
  • సెకండరీ డిస్ప్లే: ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఒక చిన్న సెకండరీ డిస్ప్లే ఉంది. ఈ రెట్రో-ఇన్‌స్పైర్డ్ సెగ్మెంట్ డిస్ప్లే లో టైమ్, బ్యాటరీ లెవెల్, టెంపరేచర్, హ్యూమిడిటీ వంటి వివరాలను చెక్ చేసుకోవచ్చు.
  • సెక్యూరిటీ: Doogee Smini లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
  • చిప్సెట్: Doogee Smini లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు.
  • మెమొరీ: Doogee Smini లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Doogee Smini లో పవర్ బ్యాకప్ కోసం 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Doogee Smini డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.