గత నెలలో భారతదేశంలో Galaxy A05s ని లాంచ్ చేసిన Samsung ఇప్పుడు Galaxy A05 ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్సైట్లో SM-A055F-DS, SM-A055F, SM-A055M-DS మరియు SM-A055M వంటి విభిన్న మోడల్ పేర్లతో కనిపించింది. ఇవి బహుశా వేర్వేరు మార్కెట్లకు సంబంధించినవని మరియు గత లీక్‌లు మరియు ఊహాగానాల ప్రకారం.. వీటిలో ఒకటి భారతదేశానికి ఉద్దేశించబడవచ్చని మేం భావిస్తున్నాం.
Samsung Galaxy A05 ఇండియా లాంచ్ వివరాలు (అంచనా)
మేము Geekbench మరియు ఇతర బెంచ్‌మార్క్ డేటాబేస్‌లలో ఈ మోడల్లను చూశాము. ఇటీవల, అధికారిక శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో SM-A055F-DS యొక్క సపోర్ట్ పేజీ ప్రత్యక్షమైంది. కాబట్టి, ఇది భారతదేశానికి సంబంధించిన Galaxy A05 మోడల్ అని మేం నమ్ముతున్నాము.
ఇకపోతే ఈ డివైజ్ బ్లాక్, సిల్వర్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- చిప్సెట్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉంటుంది.
- కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy A05 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కోర్ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 2 మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ పొందుతుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి











