
Vivo X100 సిరీస్ లాంచ్ తేదీని Vivo ఈరోజు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం, Vivo X100 సిరీస్ నవంబర్ 13న చైనాలో లాంచ్ అవుతుంది. అలాగే X100 సిరీస్ తో పాటు Vivo Watch 3ని కూడా లాంచ్ కానుంది. రాబోయే Vivo X100 సిరీస్‌లో మూడు స్మార్ట్ఫోన్లు ఉండే అవకాశం ఉంది. అవి: X100, Vivo X100 Pro మరియు X100 Pro+. లీక్స్ మరియు ఇతర సర్టిఫికేషన్ సైట్స్ ద్వారా వెల్లడైన వివరాలను తెలుసుకుందాం పదండి.

డైమెన్సిటీ 9300 చిప్‌తో వస్తోన్న Vivo X100
- Vivo X100 మరియు X100 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో వస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.
- అయితే X100 Pro+ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్ తో విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ డివైజెస్ 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటాయి.
- కెమెరా సెన్సర్స్ విషయానికొస్తే, Vivo X100 మరియు Vivo X100 Pro ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.
- X100 సోనీ IMX920 ప్రైమరీ సెన్సార్ తో వస్తుండగా, X100 Pro సోనీ IMX989 సెన్సార్‌ను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. సరే, ఓసారి Vivo X100 Pro స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Vivo X100 Pro స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Vivo X100 Pro లో ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Vivo X100 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టాలిస్ జీ720 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Vivo X100 Pro లో 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- సాఫ్ట్వేర్: Vivo X100 Pro ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Vivo X100 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 మెయిన్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో సెన్సర్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
- ఫ్రంట్ కెమెరా: Vivo X100 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: Vivo X100 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్సీ, ఇన్ఫ్రారెడ్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ68 రేటింగ్ ఉంటాయి.
కలర్స్: Vivo X100 Pro డివైజ్ బ్లాక్, పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











