
భారతీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ లావా మొబైల్స్ ఈరోజు తన కొత్త 5G ఫోన్ను భారతదేశంలో విడుదల చేసింది. LAVA Blaze 2 5G ని కంపెనీ భారతదేశంలో లాంచ్ చేసింది. ఇది తక్కువ బడ్జెట్ 5G స్మార్ట్ఫోన్. దీని ధర కేవలం రూ. 9,999 నుండి ప్రారంభమవుతుంది. 50ఎంపి కెమెరా, 6జిబి ర్యామ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ చవకైన 5G ఫోన్ ధర మరియు స్పెసిఫికేషన్ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం పదండి.
Lava Blaze 2 5G ధర
Lava Blaze 2 5G ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ గల బేస్ వేరియంట్ ధర రూ.9,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ గల మోడల్ ధరను రూ.10,999 గా నిర్ణయించారు. ఈ చవకైన 5G ఫోన్ నవంబర్ 9 నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
Lava Blaze 2 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Lava Blaze 2 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, పంచ్-హోల్ స్టైల్ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 270 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Lava Blaze 2 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ వాడారు. ఇది 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 జీపీయూ వాడారు.
- మెమొరీ: Lava Blaze 2 5G లో 4జిబి/6జిబి ర్యామ్, 4జిబి/6జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 మెమొరీ టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు.
- సాఫ్ట్వేర్: Lava Blaze 2 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ కాబట్టి అవసరంలేని యాప్స్, బ్లోట్వేర్ ఫోన్ లో ఉండవు.
- కెమెరా: Lava Blaze 2 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Lava Blaze 2 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- భద్రత: Lava Blaze 2 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
- ఇతర ఫీచర్లు: Lava Blaze 2 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ డివైజ్ 203 గ్రాముల బరువు, 8.9 మి.మీ మందం ఉంటుంది.











