రివీలైన Vivo X100 Pro కలర్స్, డిజైన్; కొత్త ఇమేజెస్ చూడండి!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo X100 Pro
  • జీస్ ఆప్టిక్స్ తో వస్తోన్న Vivo X100 Pro
  • కలర్స్: ఆరెంజ్, బ్లూ, వైట్, బ్లాక్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో తన ఫ్లాగ్షిప్ సిరీస్ X100 ని లాంచ్ చేయనుంది. చాలా రోజుల నుంచి ఈ సిరీస్ కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. రోజుకో తాజా వార్త వివో లవర్స్ లో ఆత్రుతను పెంచుతోంది. తాజాగా Vivo X100 Pro డివైజ్ యొక్క అఫీషియల్ రెండర్ ఇమేజెస్ ద్వారా కలర్ ఆప్సన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. దీంతో ఫోన్ ఫుల్ లుక్ బయటకు వచ్చినట్లైంది. భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, కలర్స్ రెండర్స్ ద్వారా రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo X100 Pro రెండర్స్, కలర్స్, డిజైన్

 

  • కలర్స్: Vivo X100 Pro స్మార్ట్ ఫోన్ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం వీబో పై సన్సెట్ ఆరెంజ్, స్టార్ బ్లూ, వైట్ మూన్‌లైన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ తో దర్శనమిచ్చింది. ఆరెంజ్ కలర్ వేరియంట్ వీగన్ లెదర్ ఫినిష్ గల బ్యాక్ ప్యానెల్ తో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అన్ని కలర్స్ కూడా వైబ్రంట్‌గా మరియు వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
  • డిజైన్: మరొక గమనించదగిన విషయం ఏంటంటే, Vivo X100 Pro లోని భారీ కెమెరా మాడ్యూల్. ఇది గత మోడల్ X90 Pro కంటే పెద్దగా ఉంది. కెమెరా మాడ్యూల్ లో 4 కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. కెమెరా రింగ్ కి బయట ఒక ఫ్లాష్‌లైట్ మాడ్యూల్ ఉంది. ఇంకా ఫోన్ కి క్రింది భాగంగా వివో బ్రాండింగ్ ఉంది.

Vivo X100 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo X100 Pro లో ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Vivo X100 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్, ఏఆర్ఎమ్ ఇమ్మోర్టాలిస్ జీ720 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo X100 Pro లో 24జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: Vivo X100 Pro ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo X100 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్989 మెయిన్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో సెన్సర్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: Vivo X100 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo X100 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ68 రేటింగ్ ఉంటాయి.
    కలర్స్: Vivo X100 Pro డివైజ్ బ్లాక్, పర్పుల్, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.