Honor 90 పై భారీ డిస్కౌంట్; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights

  • 200ఎంపి కెమెరాతో వచ్చిన Honor 90
  • సెప్టెంబర్‌లో భారత్‌లో లాంచైన డివైజ్
  • అమెజాన్ లో Honor 90 పై బ్యాంక్ ఆఫర్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor ఆమధ్య మళ్ళీ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Honor 90 డివైజ్ తో హానర్ సంస్థ రీఎంట్రీ ఇచ్చింది. రూ.39,999 ధరతో Honor 90 లాంచ్ అయ్యింది. 5జీ కనెక్టివిటీ, 19జిబి వరకు ర్యామ్ పవర్, 200ఎంపి మెయిన్ కెమెరా, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ Honor 90 లో ఉన్నాయి. అయితే ఇప్పుడు హానర్ కంపెనీ Honor 90 పై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Honor 90 డిస్కౌంట్ వివరాలు

Honor 90 పై ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో చక్కటి ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్ ద్వారా Honor 90 ధర చాలా తక్కువకి వచ్చి చేరింది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్ పై ప్రస్తుతం రూ.31,999 గా ఉంది. అంతకు ముందు ఈ వేరియంట్ ధర రూ.37,999 గా ఉండేది. ఇక బ్యాంక్ ఆఫర్ రూ.4,000 తో Honor 90 డివైజ్‌ని రూ.27,999 కే సొంతం చేసుకోవచ్చు.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ గల Honor 90 టాప్ మోడల్ గురించి మాట్లాడితే, దీని ధర రూ.33,999 గా ఉంది. రూ.4,000 బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ ఫోన్ ని రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు. లాంచ్ సమయంతో ఈ మోడల్ ధర రూ.39,999 గా ఉంది. మీరు గనుక ఫోన్ కొనే ప్లాన్ లో ఉంటే ఓసారి Honor 90 స్పెసిఫికేషన్స్ చదివి, నచ్చితే ప్రయత్నించండి.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.
  • కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Previous articleVivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్!
Next articleలాంచ్‌కి ముందు లీకైన Samsung Galaxy A25 5G ఫోటో, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.