12GB ర్యామ్, 5,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Vivo Y36 5G

Highlights

  • చైనాలో లాంచైన Vivo Y36
  • డైమెన్సిటీ 6020 చిప్‌తో వచ్చిన ఫోన్
  • Vivo Y36 ప్రారంభ ధర CNY 1,399

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ చైనాలో Vivo Y36 డివైజ్ ని లాంచ్ చేసింది. విషయం ఏంటంటే, ఇప్పటికే Vivo Y36 భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. అయితే భిన్నమైన స్పెసిఫికేషన్స్ తో Vivo Y36 ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. Vivo Y36 డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 6.56 ఇంచ్ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తోంది. సరే, ఓసారి Vivo Y36 పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y36 ధర (చైనా)

Vivo Y36 స్మార్ట్‌ఫోన్ చైనాలో 5 స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • 6జిబి + 128జిబి మోడల్ ధర CNY 1,399 (సుమారు రూ.16,100)
  • 8జిబి + 128జిబి వేరియంట్ ధర CNY 1,599 (సుమారు రూ.18,400)
  • 8జిబి + 256జిబి మోడల్ ధర CNY 1,799 (సుమారు రూ.20,700)
  • 12జిబి + 256జిబి వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.23,000)
  • 12జిబి + 512జిబి మోడల్ ధర CNY 2,399 (సుమారు రూ.27,500)

Vivo Y36 డిజైన్, కలర్ ఆప్షన్స్

చైనాలో లాంచైన Vivo Y36 డివైజ్ స్పెసిఫికేషన్స్ పరంగానే కాదు, డిజైన్ విషయంలో కూడా భిన్నంగా ఉంది. రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్, సర్క్యులర్ కెమెరా రింగ్, డ్యూయల్ రియర్ కెమెరా, వివో బ్రాండింగ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. స్పేస్ గ్రే, గెలాక్సీ గోల్డ్ మరియు ఫ్యాంటసీ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Vivo Y36 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y36 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, పంచ్ హోల్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y36 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.
  • మెమొరీ: Vivo Y36 5G లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Vivo Y36 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y36 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y36 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y36 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
Previous articleSpreadtrum T606 చిప్‌తో Google Play కన్సోల్ పై కనిపించిన itel P55+
Next articleఆంధ్రప్రదేశ్ లోని 4,300 సైట్స్‌లో మొదలుకానున్న BSNL 4G సేవలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.