Geekbench పై లిస్టైన Redmi K70; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Redmi K70 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న K70, K70 Pro, K70e
  • గీక్‌బెంచ్‌పై కనిపించిన Redmi K70

షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో చైనా మార్కెట్ లో Redmi K70 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Redmi K70, Redmi K70 Pro, Redmi K70e. గత కొన్ని రోజులుగా Redmi K70 సిరీస్ కి సంబంధించి పలు లీక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా స్టాండర్డ్ వేరియంట్ Redmi K70 గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Redmi K70 యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Redmi K70 గీక్‌బెంచ్ లిస్టింగ్

  • గీక్‌బెంచ్ పై Redmi K70 డివైజ్ 2311DRK48C అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • Redmi K70 సింగిల్-కోర్ టెస్ట్ లో 1,248 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4,177 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Redmi K70 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్సెట్, మాలి-జీ615 ఎంసీ6 జీపీయూ తో వస్తున్నట్లు లిస్ట్ ద్వారా తెలుస్తోంది.
  • 16జిబి ర్యామ్ తో గీక్ బెంచ్ పై Redmi K70 లిస్ట్ అయ్యింది.
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో Redmi K70 వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Redmi K70 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Redmi K70 లో ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉంటాయి. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియలేదు.
  • ప్రాసెసర్: Redmi K70 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్సెట్, మాలి-జీ615 ఎంసీ6 జీపీయూ ఉంటాయని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi K70 లో 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: Redmi K70 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi K70 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi K70 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.