
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy A25 5G అనే పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. శాంసంగ్ నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాకముందే, మైస్మార్ట్‌ప్రైస్ వెబ్‌సైట్ అఫీషియల్ రెండర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A25 5G డిజైన్ రెండర్ (లీక్)
- Samsung Galaxy A25 5G లో సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉన్నాయి.
- డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఎడమ వైపున ఉంది. బాటమ్ లో శాంసంగ్ లోగో కనిపిస్తోంది.
- Samsung Galaxy A25 5G లో ముందు వైపు వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంది. ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్ ఉన్నాయి. ఎడమవైపున సిమ్ ట్రే ఉంది.
- Samsung Galaxy A25 5G డివైజ్ బ్లూ, బ్లాక్, యెల్లీ, లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఇన్ఫినిటీ-యూ నాచ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A25 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. మెమొరీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుటుంది.
- కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో రానుంది. కంపెనీ 4 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy A25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, నాక్స్ సెక్యూరిటీ, శాంసంగ్ పే వంటి ఫీచర్లు ఉంటాయి.
- బరువు, చుట్టుకొలత: Samsung Galaxy A25 5G డివైజ్ 161.0 మి.మీ పొడవు, 76.5 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం, 197 గ్రాముల బరువు ఉంటుంది.












