
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor త్వరలో Honor 100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Honor 100, Honor 100 Pro అనే డివైజెస్ రానున్నాయి. నవంబర్ 23 న ఈ ఫోన్లు చైనాలో లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్లు బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించాయి. దీంతో రెండు ఫోన్ల యొక్క చిప్సెట్ వివరాలు తెలిసాయి. సరే, ఓసారి Honor 100 మరియు Honor 100 Pro యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Honor 100, Honor 100 Pro గీక్‌బెంచ్ వివరాలు
Honor 100, Honor 100 Pro స్మార్ట్‌ఫోన్లు గీక్‌బెంచ్ 6 పై లిస్ట్ అవ్వడంతో వీటి యొక్క స్పెసిఫికేషన్స్ పై స్పష్టత వచ్చింది. గీక్‌బెంచ్ 6 పై స్టాండర్డ్ మోడల్ Honor 100 MAA-AN00 అనే మోడల్ నంబర్ తో లిస్టైంది. ఇంకా లిస్టింగ్ లో SM7550 అనే మోడల్ నంబర్ ని చిప్సెట్ కలిగి ఉంది. ఈ మోడల్ ని బట్టి స్టాండర్డ్ వేరియంట్ Honor 100 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.
Honor 100, Honor 100 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Honor 100 Pro లో 1.5కే అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా తెలిసింది. అలాగే ఈ ఫోన్ లో పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఫీచర్ కూడా ఉంటుందని సమాచారం.
- ర్యామ్: Honor 100 సిరీస్ డివైజెస్ 16జిబి వరకు ర్యామ్ తో వచ్చే అవకాశం ఉంది.
- చార్జింగ్: Honor 100 Pro డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు 3సీ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.
- కెమెరా: Honor 100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ Honor 100 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
- త్వరలో రాబోయే Honor 100, Honor 100 Pro డివైజెస్ లో ఎస్ఎల్ఆర్-లెవెల్ ఫోటోస్ ని క్యాప్చర్ చేయవచ్చని హానర్ కంపెనీ చెబుతోంది.
- Honor 100 సిరీస్ వైట్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.











