
షావోమి సబ్-బ్రాండ్ Redmi చైనాలో Redmi Note 13R Pro ని లాంచ్ చేసింది. ఇప్పటికే సెప్టెంబర్ లో Redmi Note 13 సిరీస్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. లైనప్ లో Redmi Note 13 5G, Note 13 Pro, Note 13 Pro+ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. నేడు, కంపెనీ Redmi Note 13R Pro అనే మరొక మోడల్ ని లాంచ్ చేసింది. సరే, ఓసారి Redmi Note 13R Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Redmi Note 13R Pro ధర, కలర్ ఆప్షన్స్
- చైనాలో Redmi Note 13R Pro డివైజ్ కేవలం ఒకే ఒక్క వేరియంట్ లో లాంచ్ అయ్యింది. అది 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. దీని ధరను 1,999 యువాన్లుగా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.23,000 గా ఉండవచ్చు.
- Redmi Note 13R Pro డివైజ్ మిడ్నైట్ బ్లాక్, టైమ్ బ్లూ మరియు మార్నింగ్ లైట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో Redmi Note 13R Pro డివైజ్ POCO X6 Neo పేరుతో లాంచ్ కానుంది. ఇంకా పోకో ఎక్స్6 నియో ఫోన్ లాంచ్ వివరాలు తెలియలేదు. త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.
Redmi Note 13R Pro స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Redmi Note 13R Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1920 పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi Note 13R Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi Note 13R Pro డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: Redmi Note 13R Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి 3-ఎక్స్ జూమ్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Redmi Note 13R Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi Note 13R Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3 ఉంటాయి. సెక్యూరిటీ కోసం ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. Redmi Note 13R Pro లో ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది.











