
షావోమి సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో విడుదలైంది. Redmi 13C ఫోన్ 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ తో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇక భారత్ లో Redmi 13C మీడియాటెక్ హీలియో జీ85 చిప్ తో రానున్నట్లు సమాచారం. సరే, ఓసారి ఇండియా లాంచ్ సమాచారం, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Redmi 13C స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- స్క్రీన్: Redmi 13C లో 6.74-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi 13C లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడారు. ఇది 9 నానోమీటర్ పై తయారైన ప్రాసెసర్. 2.0 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ దీని సొంతం.
- ఓఎస్: Redmi 13C డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- మెమొరీ: Redmi 13C డివైజ్ 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్ మరియు 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో నైజీరియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: Redmi 13C లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Redmi 13C లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Redmi 13C లో భద్రత కోసం రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.
- కనెక్టివిటీ: Redmi 13C లో 4జీ, డ్యూయల్ సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై వంటి ఫీచర్లు ఉన్నాయి.
Redmi 13C ధర
- Redmi 13C స్మార్ట్‌ఫోన్ నైజీరియాలో రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
- 4జిబి ర్యామ్ మోడల్ ధర NGN 98,100 (సుమారు రూ.10,100) గా ఉంది.
- Redmi 13C 8జిబి ర్యామ్ మోడల్ ధర NGN 108,100 (సుమారు రూ.11,100) గా ఉంది.
- భారత్ లో రూ.10,000 లోపు ధరతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.











