TDRA సర్టిఫికేషన్ పొందిన OPPO Reno 11 Pro; త్వరలో గ్లోబల్‌గా లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 11 Pro
  • టీడీఆర్ఏ సైట్ లో కనిపించిన డివైజ్
  • 8+ జెన్ 1 చిప్‌తో వస్తోన్న OPPO Reno 11 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రానున్న OPPO Reno 11, OPPO Reno 11 Pro డివైజెస్ గ్లోబల్ మార్కెట్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. తాజాగా OPPO Reno 11 Pro డివైజ్ టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో కనిపించింది. సరే, ఓసారి సర్టిఫికేషన్ వివరాలతో పాటు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11 Pro టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వివరాలు

  • OPPO Reno 11 Pro టీడీఆర్ఏ సర్టిఫికేషన్ పై CPH2607 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • టీడీఆర్ఏ సర్టిఫికేషన్ ద్వారా మోడల్ నంబర్ తప్పా మరే ఇతర హార్డ్‌వేర్ వివరాలు బయటకు రాలేదు. చైనాలో ఇప్పటికే ఫోన్ లాంచ్ అవ్వడం వల్లన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు.
  • గ్లోబల్ మోడల్స్ కూడా అవే స్పెసిఫికేషన్స్ తో వస్తాయని మేం అంచనా వేస్తున్నాం.

OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO Reno 11 Pro లో 6.74-ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 11 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11 Pro డివైజ్ 12జిబి+256, 12జిబి+512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: OPPO Reno 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OPPO Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 32ఎంపి పొట్రెయిట్ లెన్స్, 8ఎంపి 2ఎక్స్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OPPO Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Previous articleత్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Redmi 13C; ధర రూ.10,000 లోపే!
Next articleNBTC సర్టిఫికేషన్ పొందిన Samsung Galaxy S24 Ultra
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.