
iQOO Neo 9 Pro స్మార్ట్ ఫోన్ డిసెంబర్ నెలలో లాంచ్ కానుంది. అయితే ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీ వెల్లడి కాలేదు. iQOO Neo 9 సిరీస్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ లాంచ్ కానున్నాయి. అయితే ఈలోపే iQOO Neo 9 Pro డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పై ప్రత్యక్షమయ్యాయి. మరి ఆ లీక్స్ ద్వారా తెలిసిన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.
iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
iQOO Neo 9 Pro
– 6.78" 1.5K OLED, 144Hz
– MediaTek Dimensity 9300 SoC
– 50MP (IMX920) + 50MP
– 16MP selfie
– Android 14, OriginOS/ Funtouch OS
– Q1 chip
– IR sensor, in-display fp
– 5,000mAh battery, 120W charging— Yogesh Brar (@heyitsyogesh) December 4, 2023
ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ X ప్లాట్‌ఫామ్ పై iQOO Neo 9 Pro కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని షేర్ చేశారు.
- డిస్ప్లే: iQOO Neo 9 Pro లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి ఐఎంఎక్స్920 మెయిన్ సెన్సర్, 50ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ ఉంటుంది.
- ఓఎస్: iQOO Neo 9 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: iQOO Neo 9 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: iQOO Neo 9 Pro లో క్యూ1 చిప్, ఐఆర్ సెన్సర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.











