
షావోమి సబ్-బ్రాండ్ Redmi భారత్ లో Redmi 13C 5G డివైజ్ ని లాంచ్ చేసింది. 13C సిరీస్ లో 5జీ మరియు 4జీ మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. అవి: Redmi 13C 5G, Redmi 13C 4G. ఈ ఆర్టికల్ లో మనం Redmi 13C 5G గురించి తెలుసుకుందాం. Redmi 13C 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. సరే, ఓసారి Redmi 13C 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Redmi 13C 5G ధర
- Redmi 13C 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది.
- Redmi 13C 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,499 గా ఉంది.
- Redmi 13C 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది.
- ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా Redmi 13C 5G డివైజ్ ని కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. డిసెంబర్ 16 నుంచి Redmi 13C 5G సేల్ ప్రారంభమవుతుంది. స్టార్‌ట్రెయిల్ సిల్వర్, స్టార్‌ట్రెయిల్ గ్రీన్ మరియు స్టార్‌ట్రెయిల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
Redmi 13C 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Redmi 13C 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్, టీయూవీ ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్, లో-బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Redmi 13C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ 2 జీపీయూ వినియోగించారు.
- కెమెరా: Redmi 13C 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి సెల్ఫీ ఏఐ కెమెరా అందించారు.
- ర్యామ్, స్టోరేజీ: Redmi 13C 5G డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో ర్యామ్ పవర్ ని పెంచుకునే వీలుంది. అలాగే మెమొరీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
- బ్యాటరీ: Redmi 13C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Redmi 13C 5G లో 7 5జీ బ్యాండ్స్, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











