16GB ర్యామ్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Redmi 13C 4G

Highlights

  • భారత్ లో లాంచైన Redmi 13C 4G
  • 50ఎంపి కెమెరాతో వచ్చిన డివైజ్
  • Redmi 13C 4G ప్రారంభ ధర రూ.7,999

షావోమి సబ్-బ్రాండ్ Redmi భారత్ లో Redmi 13C 4G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. Redmi 13C సిరీస్ లో 4జీ, 5జీ మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో Redmi 13C 4G ఫోన్ గురించి తెలుసుకుందాం. Redmi 13C 4G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 16జిబి వరకు ర్యామ్ పవర్, 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి Redmi 13C 4G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi 13C 4G ధర

  • Redmi 13C 4G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.7,999 గా ఉంది.
  • Redmi 13C 4G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.8,999 గా ఉంది.
  • Redmi 13C 4G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది.
  • మూడు వేరియంట్స్ పై కూడా ఇవి స్పెషల్ లాంచ్ ధరలని గమనించాలి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పై Redmi 13C 4G డివైజ్ ని కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
  • Redmi 13C 4G డివైజ్ ని అమెజాన్, ఎంఐ.కామ్ మరియు షావోమి రిటైల్ స్టోర్స్ ద్వారా డిసెంబర్ 12 నుంచి కొనుగోలు చేయవచ్చు.

Redmi 13C 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 13C 4G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13C 4G లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 13C 4G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా ర్యామ్ పవర్ ని పెంచుకునే వీలుంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Redmi 13C 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Redmi 13C 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi 13C 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 13C 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.