Dimensity 6100+ చిప్సెట్‌తో చైనాలో లాంచైన Redmi 13R 5G

Highlights

  • చైనాలో లాంచైన Redmi 13R 5G
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చిన డివైజ్
  • Redmi 13R 5G ప్రారంభ ధర 999 యువాన్లు

Xiaomi సబ్-బ్రాండ్ Redmi చైనాలో Redmi 13R 5G డివైజ్ ని లాంచ్ చేసింది. రూ.11,700 ప్రారంభ ధరతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. భారత్ లో లాంచైన Redmi 13C కి రీబ్రాండ్ వర్షన్ గా Redmi 13R 5G చైనాలో ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఫోన్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, 50 మెగా పిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Redmi 13R 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Redmi 13R 5G ధర, కలర్ ఆప్షన్స్

  • Redmi 13R 5G స్మార్ట్‌ఫోన్ చైనాలో సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 999 యువాన్లు (సుమారు రూ.11,700) గా ఉంది.
  • Redmi 13R 5G డివైజ్ స్టార్ రాక్ బ్లాక్, ఫ్యాంటసీ పర్పుల్ మరియు వేవ్ వాటర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Redmi 13R 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Redmi 13R 5G లో 6.74-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ స్క్రీన్, వాటర్‌డ్రాప్-నాచ్ డిజైన్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Redmi 13R 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Redmi 13R 5G లో 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Redmi 13R 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Redmi 13R 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi 13R 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 13R 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Redmi 13R 5G డివైజ్ 168.05 మి.మీ పొడవు, 77.91 మి.మీ వెడల్పు, 8.19 మి.మీ మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది.