
ఇటీవలి కాలంలో చవక ఫోన్ల సెగ్మెంట్లో జనాదరణ పొందిన Infinix సంస్థ మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. Infinix Smart 8 HD పేరుతో లాంచైన ఈ ఫోన్ యూనిఎస్ఓసీ టీ606 చిప్, 6జిబి ర్యామ్, మ్యాజిక్ రింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డైనమిక్ నాచ్ (మ్యాజిక్ రింగ్) ఉన్నాయి. సరే, ఓసారి Infinix Smart 8 HD ధర, పూర్తి స్పెసిఫికేషన్స్, సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Infinix Smart 8 HD ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్
- Infinix Smart 8 HD డివైజ్ ధరను రూ.5,699 గా నిర్ణయించారు. చాలా తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ ని కొనుగోలు చేయాలని భావిస్తోన్న వారికి ఈ ఫోన్ చక్కటి ఆప్షన్ గా నిలవనుంది.
- డిసెంబర్ 13 వ తేదీ నుంచి ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Infinix Smart 8 HD సేల్ మొదలవ్వనుంది.
- యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కలిగిన వారికి మొబైల్ పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
- Infinix Smart 8 HD స్మార్ట్‌ఫోన్ క్రిస్టల్ గ్రీన్, షైనీ గోల్డ్, టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Infinix Smart 8 HD స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Infinix Smart 8 HD లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డైనమిక్ నాచ్ (మ్యాజిక్ రింగ్) ఉన్నాయి.
- చిప్సెట్: Infinix Smart 8 HD లో యూనిఎస్ఓసీ టీ606 చిప్ వాడారు. ఇది ఎంట్రీ లెవెల్ చిప్సెట్.
- ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 HD లో 6జిబి వరకు ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి.
- ఓఎస్: Infinix Smart 8 HD డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Infinix Smart 8 HD లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కూడా ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
- సెక్యూరిటీ: Infinix Smart 8 HD లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి.
- కనెక్టివిటీ: Infinix Smart 8 HD లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











