డిసెంబర్ 14 న లాంచ్ అవుతోన్న Lava Yuva 3 Pro

Highlights

  • Lava Yuva 3 Pro లాంచ్ తేదీ ప్రకటన
  • డిసెంబర్ 14 న లాంచ్ అవ్వనున్న డివైజ్
  • ఇంకా వెల్లడి కాని Lava Yuva 3 Pro ధర

స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో Yuva 3 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. 2023 ఆరంభంలో లాంచైన Lava Yuva 2 Pro కి Lava Yuva 3 Pro సక్సెసర్ గా వస్తోంది. తాజాగా లావా సంస్థ Lava Yuva 3 Pro లాంచ్ తేదీని ప్రకటించింది. Lava Yuva 3 Pro డివైజ్ డిసెంబర్ 14 వ తేదీన మార్కెట్ లోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది. సరే, ఓసారి Lava Yuva 3 Pro యొక్క అంచనా స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Yuva 3 Pro లాంచ్ వివరాలు

Lava Yuva 3 Pro స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 14 న భారత్ లో లాంచ్ అవుతోంది. టీజర్ వీడియో ద్వారా ఈ విషయాన్ని కంపెనీ ఖరారు చేసింది. లావా ఇండియా సోషల్ ప్లాట్ఫామ్స్ పై వర్చువల్ ఈవెంట్ ద్వారా Lava Yuva 3 Pro ఫోన్ లాంచ్ కానుంది. డిసెంబర్ 14 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Lava Yuva 3 Pro ధర, సేల్ వివరాలు, స్పెసిఫికేషన్స్ వెల్లడవుతాయి.

Lava Yuva 3 Pro ధర (లీక్)

టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Lava Yuva 3 Pro ధరను X ప్లాట్ఫామ్ ద్వారా లీక్ చేశారు. భారత్ లో రూ.10,999 ధరతో Lava Yuva 3 Pro లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు. ఇది 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర. డిసెంబర్ 14 న డివైజ్ యొక్క అసలు ధర ఏంటో తెలిసిపోనుంది.

Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Lava Yuva 3 Pro లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava Yuva 3 Pro లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ ఉంటుంది.
  • ఓఎస్: Lava Yuva 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ప్యూర్ ఎడిషన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Yuva 3 Pro డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో రానున్నట్లు సమాచారం.
  • కెమెరా: Lava Yuva 3 Pro కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • బ్యాటరీ: Lava Yuva 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Previous articleVivo X100, X100 Pro గ్లోబల్ లాంచ్ తేదీ ఖరారు
Next article50MP కెమెరా, 8GB ర్యామ్‌తో గ్లోబల్‌గా లాంచైన Samsung Galaxy A25 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.