డిసెంబర్ 21న భారత్‌లో లాంచ్ అవుతోన్న Lava Storm 5G

Highlights

  • Lava Storm 5G లాంచ్ ప్రకటన
  • డిసెంబర్ 21 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల
  • అమెజాన్ ద్వారా Lava Storm 5G సేల్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava త్వరలో Lava Storm 5G డివైజ్ తో మార్కెట్ లోకి రానుంది. తాజాగా లావా సంస్థ ఈ ఫోన్ లాంచ్ తేదీన ప్రకటించింది. డిసెంబర్ 21 వ తేదీన భారతీయ మార్కెట్ లో Lava Storm 5G డివైజ్ లాంచ్ అవుతోంది. అమెజాన్ లో Lava Storm 5G ప్రొడక్ట్ పేజీ దర్శనమిస్తోంది. దీంతో ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ కి రానుందని స్పష్టమవుతోంది. సరే, ఓసారి Lava Storm 5G లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava Storm 5G లాంచ్ తేదీ

డిసెంబర్ 21 వ తేదీన భారత్ లో Lava Storm 5G లాంచ్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో లావా సంస్థ Lava Storm 5G లాంచ్ టీజర్ వీడియోని షేర్ చేసింది. డిసెంబర్ 21న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ విడుదలవుతుంది. ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ లో Lava Storm 5G ప్రొడక్ట్ పేజీ లిస్ట్ అవ్వడంతో, ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ కి రానుందని తెలుస్తోంది.

Lava Storm 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: Lava Storm 5G లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Lava Storm 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Lava Storm 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Storm 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ కానుంది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Lava Storm 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని సమాచారం. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Lava Storm 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.