
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy S24 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా Samsung Galaxy S24 సిరీస్ కి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Samsung Galaxy S24+ డివైజ్ వాల్మార్ట్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా ప్రధాన ఫీచర్లు రివీల్ అయ్యాయి. మరొక లీక్ ద్వారా డివైజ్ యొక్క ప్రీ-ఆర్డర్ ప్రయోజనాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy S24+ వాల్మార్ట్ లిస్టింగ్ వివరాలు
- డిస్ప్లే: వాల్మార్ట్ లిస్టింగ్ ప్రకారం, Samsung Galaxy S24+ లో 6.7-ఇంచ్ డిస్ప్లే, ఐ కంఫర్ట్ షీల్డ్, 3120*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయని తెలుస్తోంది.
- బరువు: Samsung Galaxy S24+ డివైజ్ 200 గ్రాముల బరువు ఉంటుంది. గత మోడల్ Samsung Galaxy S23+ డివైజ్ 196 గ్రాముల బరువు ఉంది.
- కెమెరా: Samsung Galaxy S24+ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని సమాచారం. అలాగే ఫుల్ 50ఎంపి మోడ్, నైటోగ్రఫీ జూమ్ ఆప్షన్స్ ఉంటాయి.
- వేరియంట్: Samsung Galaxy S24+ యొక్క 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ మోడల్ లిస్టింగ్ ద్వారా లీకైంది. అలాగే లిస్టింగ్ లో ఆనిక్స్ బ్లాక్ కలర్ వేరియంట్ కనిపిస్తోంది.
Samsung Galaxy S24+ ఏఐ ఫీచర్స్ (లీక్)
- జనరేటివ్ ఎడిట్: Samsung Galaxy S24+ లో గ్యాలరీ యాప్ లో ఫోటో ఎడిటర్ ఇన్బిల్ట్ గా వస్తోంది. దీని ద్వారా ఇమేజ్ ని ఎడిట్ చేసి, అవసరం లేని ఆబ్జెక్ట్స్ ని తొలగించవచ్చు. Samsung Galaxy S24+ లో ఇంకా ఫిల్లింగ్ ఫీచర్ అందిస్తున్నారు. దీని ద్వారా ఇమేజ్ కి సంబంధించిన ఒకే రకమైన పోర్షన్ ని కావాల్సిన చోట ఫిల్ చేసుకునే వీలుంటుంది.
- లైవ్ ట్రాన్స్లేట్: Samsung Galaxy S24+ లో బిల్ట్-ఇన్ ట్రాన్స్లేటర్ ఉంటుంది. దీని ద్వారా ఏదేనీ విదేశీ భాషలను అప్పటికప్పుడే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు.
- రీసెంట్ గా వచ్చిన మరో లీక్ లో Samsung Galaxy S24 సిరీస్ గెలాక్సీ ఏఐ అనే జనరేటివ్ టెక్ట్స్ కేపబులిటీని కలిగి ఉంటుందని తెలిసింది.
Samsung Galaxy S24 ప్రీ-ఆర్డర్ ప్రయోజనాలు (రూమర్లు)
దక్షిణ కొరియా పబ్లికేషన్ Naver ప్రకారం, శాంసంగ్ సంస్థ ఉచిత స్టోరేజీ అప్గ్రేడ్ మరియు గెలాక్సీ ఇయర్ బడ్స్, వాచెస్ ని డిస్కౌంట్ ధరకి అందించబోతున్నట్లు తెలుస్తోంది. కచ్చితమైన డిస్కౌంట్ వివరాలు ఇంకా తెలియలేదు.











