Unisoc T606 చిప్, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన itel P55+

Highlights

  • గ్లోబల్‌గా లాంచైన itel P55+
  • 4జీ కనెక్టివిటీతో వచ్చిన డివైజ్
  • itel P55+ ధర 140 డాలర్లు

తక్కువ బడ్జెట్ లో ఫోన్లను లాంచ్ చేస్తూ జనాల్లో itel సంస్థ గుర్తింపు సంపాదించింది. తాజాగా ఈ కంపెనీ itel P55+ డివైజ్ ని సౌతాఫ్రికా మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 4జీ కనెక్టివిటీ మాత్రమే ఉంది. కానీ, గత మోడల్ itel P55 లో 5జీ కనెక్టివిటీ ఉంది. itel P55+ స్మార్ట్‌ఫోన్ లో Unisoc చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. సరే, ఓసారి itel P55+ డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

itel P55+ ధర, లభ్యత

  • itel P55+ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ బ్లూ, రాయల్ గ్రీన్ మరియు మిటియోర్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • itel P55+ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధర 140 డాలర్లు (సుమారు రూ.11,700) గా ఉంది.
  • itel P55+ డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

itel P55+ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: itel P55+ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: itel P55+ లో Unisoc T606 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ1 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: itel P55+ డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఇంకా ఈ డివైజ్ 4జిబి/6జిబి/8జిబి వర్చువల్ ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: itel P55+ లో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఇంకా పనోరమా మోడ్, సూపర్ నైట్ మోడ్, ఏఐ క్లియర్ పొట్రెయిట్, ప్రో మోడ్, టైమ్ ల్యాప్స్ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: itel P55+ లో డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: itel P55+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: itel P55+ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
Previous articleWalmart లిస్టింగ్ ద్వారా రివీలైన Samsung Galaxy S24+ ప్రధాన ఫీచర్లు
Next articleRedmi Note 12 4G ధర తగ్గింపు; పూర్తి వివరాలు తెలుసుకోండి!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.